PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాలల హక్కులపై అవగాహన కల్పించండి..

1 min read

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డా. జె .రాజేంద్రప్రసాద్

కర్నూలు, పల్లెవెలుగు: బాలల హక్కులపై బాలుల కు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని  రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు.డా. జె .రాజేంద్రప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియం నందు ఐసిడిఎస్ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్స్, హాస్టల్స్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ అధికారులతో  రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డా. జె .రాజేంద్రప్రసాద్ జిల్లా స్థాయి ఇంటరాక్షన్ నిర్వహించారు.  ఈ సందర్భంగా డా. జె .రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 18 సంవత్సరాలలోపు చిన్నారులకు, విద్యార్థులకు విద్యా , వైద్య సదుపాయాలతో పాటు అధిక నిధులు మంజూరు చేసి అనేక ప్రభుత్వ పథకాల ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించి కమిషన్ ద్వారా పటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం బాలల హక్కుల పరిరక్షణకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలన్నారు. ముఖ్యంగా వసతి గృహాల్లో ఉన్న అధికారులు సిబ్బంది బాలల తో స్నేహపూర్వక వాతావరణంతో మెలగాలని, ముఖ్యంగా వారి విద్యా ఆరోగ్యం వ్యక్తిగత భద్రత పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని వసతి గృహాల్లో పై తెలిపిన అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మరియు బాలల చట్టాలపై అధికారులతో పాటు బాలలకు కూడా అవగాహన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే బాలల హెల్ప్ లైన్ ఫోన్ నంబర్ – 1098 ను  సంక్షేమ హాస్టల్లో ఏర్పాటు చేయాలని, అలాగే బాలల సంక్షేమ సమితి వివరాలు ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేయాలని,  దీనికి సంబంధించి ప్రత్యేకంగా విద్యాశాఖ సంక్షేమ శాఖ , ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం బీసీ వెల్ఫేర్ మరియు ఐసిడిఎస్… పి డి వెంకట లక్ష్మమ్మ, గిరిజన సంక్షేమ శాఖ మరియు సాంఘిక సంక్షేమ శాఖ జెడి రంగలక్ష్మి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి సునీల్ కన్నా, గురుకుల పాఠశాలల కోఆర్డినేటర్ శ్రీదేవి, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జుబేదాబేగం. హెచ్ డబ్ల్యు ఓ…లు బాబు… మద్దిలేటి,తదితరులు బాలుల హక్కుల పరిరక్షణపై సమావేశంలో వివరించారు.  ఆ తరువాత  బాల్య వివాహాల నిషేధ చట్టం-2006 కు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ మరియు ఐసిడిఎస్ PD  వెంకట లక్ష్మమ్మ, సాంఘిక సంక్షేమ శాఖ జెడి రంగ లక్ష్మి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి సునీల్ కన్నా, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్స్, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్. జిల్లా బాలల సంరక్షణ అధికారి శారద. తదితరులు పాల్గొన్నారు.

About Author