PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులకు అండగా నిలిచి చెరో ఐదు లక్షలు అందజేసిన చింతమనేని ప్రభాకర్

1 min read

పెద్ద మనసుతో వైద్యుడు ఆదరించాడు

ఆనందభాష్పాలతో చింతమనేని కి కృతజ్ఞతలు తెలియజేసిన తల్లిదండ్రులు

ఏ ఒక్కరికి ఆపద వచ్చిన కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది 

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దెందులూరు ఎం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ బాధితులకు అండగా ఉంటారని అనడానికి ఇదో మచ్చు తునకగా చెప్పవచ్చు, పెదవేగి మండలం వేగివాడకు చెందిన చలమాల జగదీష్ 6వ తరగతి, గార్లమడుగు పంచాయతీ సూర్యారావు పేట గ్రామానికి చెందిన పూర్ణ చంద్రరావు 9 వతరగతి చదివే విద్యార్థులు వీరిరువురు వేర్వేరు ప్రమాదాలకు గురయ్యారు,వీరికి జరిగిన ప్రమాదాలలో ఇరువురి మో కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి,            వీరికి ఏలూరులో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఆర్ధో పెడిక్ డాక్టర్ మోకాళ్లకు చేసిన శస్త్ర చికిత్సలు పెయిల్యూర్ అయ్యాయి దీనితో ఇరువురి మోకాళ్ళు వంకర్లు తిరిగి నడవలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు,ఇరువురు విద్యార్థులకు ఆసుపత్రిలో వైద్య శస్త్ర చికిత్సలు పెయిల్యూర్ అయ్యాయని తెలుసుకున్న దెందులూరు ఎం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ బాధిత విద్యార్దులకు అండగా నిలిచి వారి పరిస్థితి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు,అదే సందర్భం లో ఆ విద్యార్థులకు శస్త్ర చికిత్సలు నిర్వహించిన ప్రయివేటు వైద్యుడి ని కూడా సంప్రదించి వీరిరువురికి మరో సారి శస్త్ర చికిత్సలు నిర్వహించి వంకర్లుగా ఉన్న మోకాళ్లను సరిచేయాలని కోరారు,అంతే కాదు వారి కి ఆర్థిక భద్రతా పరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరడం తో చింతమనేని ప్రతిపాదన పై స్పందించిన వైద్యుడు సహృదయంతో ఇరువురి విద్యార్థులకు చెరో 5 లక్షలు చొప్పున మొత్తం 10 లక్షలు ఆర్థిక సహాయం అందజేశారు,వైద్యుడు అందజేసిన 10 లక్షల రూపాయలను మంగళవారం ఏలూరు జిల్లా పరిషత్ గెస్ట్ హౌజ్ లో ప్రెస్ మీట్ నిర్వహించి ఆ ప్రెస్ మీట్ కి బాధిత విద్యార్థులను వారి తల్లిదండ్రులను పిలిపించి మీడియా ప్రతినిధుల సమక్షం లో  బాధిత విద్యార్థుల కు ఎం ఎల్ ఏ చింతమనేని చేతుల మీదగా చెరొక 5 లక్షలు చొప్పున  అందజేశారు,ఈ పది లక్షలు బాధిత విద్యార్థుల పేర పిక్సీడ్ డిపాజిట్ చేస్తామని ఎం ఎల్ ఏ చింతమనేని చెప్పారు,బాధిత బాలలకు ఆర్థిక భద్రత కల్పించిన డాక్టర్ ని కూడా చింతమనేని అభినందించారు,ద్వారాకాతిరుమల విర్డ్స్ ఆసుపత్రిలో బాధిత విద్యార్థులకు .మరోసారి శస్త్ర చికిత్సలు నిర్వహించడానికి అవసరమయ్యే ఆర్థిక వనరులనుకూడా సమకూర్చడానికి  బాధిత విద్యార్థులకు ఆపరేషన్ చేసిన డాక్టర్  అంగీకరించారని ఎం ఎల్ ఏ చింతమనేని ప్రెస్ మీట్ లో తెలియజేసారు,ఈ కాశర్యక్రమం లో పెదవేగి మండల టిడిపి అధ్యక్షులు బొప్పన సుధాకర్, కొల్లేరు నేత సైదు సత్యనారాయణ ,తలకొండ జమాలయ్య.కొండలరావు పాలెం టి.డి.పి నాయకుడు నాగు తదితరులున్నారు.

About Author