దేవుడిని సంతోష పెట్టడమే.. క్రిస్మస్
1 min readకర్నూలు, పల్లెవెలుగు: దేవుడిని సంతోష పెట్టడమే నిజమైన క్రిస్మస్ పండగ అని సూచించారు జయంతి, సంతోష్ కుమార్ . నగరంలోని సాయిబాబా నగర్ లో సోమవారం ప్రైస్ ద లార్డ్ గ్రూపు సభ్యులందరూ కలిసి ఏసు ప్రభు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరించిన జయంతి, సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రభు సందేశం…ప్రపంచ మానవాళి పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం క్రిస్మస్ సందర్భంగా చిన్నారులు వేసిన నాటిక చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత బైబిల్ పరీక్షలో ఉత్తీర్ణులైన చిన్నారులకు పెద్దలు బహుముతులు అందజేశారు. అంతకు ముందు కాలనీలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమములో సాయిబాబా నగర్ కాలనీ వాసులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పండగను జరుపుకున్నారు.