శ్రీ ఉమా మాధవ స్కూల్లో క్రిస్మస్ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక సంతోష్ నగర్ లోని శ్రీ ఉమా మాధవ పాఠశాలలో ఈరోజు ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి .ఈ వేడుకలలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీ బి. మాధవకృష్ణ విద్యార్థులతో మాట్లాడుతూ మన పండుగలు మన దేశ సంస్కృతిని, ఔన్నత్యాన్ని చాటుతూ యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. జీసస్ మన అందరికీ ఆదర్శ భావాలను తెలియపరచి ,సంఘములో ఎలా నడుచుకోవాలో, విద్యాబుద్ధులతో ఉన్నత స్థాయిని ఎలా చేరుకోవాలో చక్కగా విషవిశదపరచి మన అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు.జీసస్ లోని శాంతిని ,పరోపకారాన్ని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జీసస్ ను ప్రార్థిస్తూ క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు జీసస్ వేషధారణలతో చూపరులను కనువిందు చేశారు. ఉపాధ్యాయులందరూ ముందస్తు క్రిస్మస్ వేడుకలలో పాల్గొని సంతోషంతో మిఠాయిలు పంచుకోవడం జరిగింది .