క్రీస్తు జననం అపూర్వమైనది
1 min readజిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు…పరిగెల మురళీకృష్ణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క్రీస్తు జననం అపూర్వమైనదని, అలాగే కర్నూలు జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు పాలకమండలి మాజీ సభ్యులు పి మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ కమిటి ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగినవి. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మురళీకృష్ణ మాట్లాడుతూ యేసు క్రీస్తు జననానికి గుర్తుగా, ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే పండుగ క్రిస్మస్ అని, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అని, యేసు మన కోసం చనిపోయి తిరిగి బ్రతికాడని, క్రైస్తవులు గుర్తుంచు కుంటారన్నారు. క్రీస్తు జననం వల్ల రెండు అపూర్వ ఘట్టాలు మానవ చరిత్రలో ఆవిష్కరింప బడ్డాయని అవి క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకంగా గుర్తింపులోకి వచ్చాయన్నారు. అనంతరం పాస్టర్ రెవరెండ్ జీవన్ మాట్లాడుతూ క్రీస్తు ప్రేమ, ఆప్యాయతలను పెంచు, శాంతిని పంచు అంటూ పాపాల నుండి ప్రజలను విముక్తి చేయడానికి జన్మించిన క్రీస్తు ఆ ప్రజల కోసమే ముళ్ళ కిరీటాన్ని ధరించి, సిలువపై రక్తం చిందించాడనీ ఈ ప్రపంచానికి క్రీస్తు ప్రేమ తత్వమే దేవోపదేశము ..మానవత్వమే సారాంశము అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీసీ చర్చ్ క్వాయర్ వారు పాటలు పాడి దేవుణ్ణి స్తుంతించారు. అనంతరం సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాస్టర్ రెవరెండ్ జీవన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, ఎం సుధాకర్ బాబు , కర్నూల్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ జిలాని భాష, కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ పిజి రామ్ పుల్లయ్య యాదవ్, పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధకృష్ణ, సిటీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు జాన్ విల్సన్, కాంగ్రెస్ నాయకులు ఎన్ సి బజారన్న, అనంతరత్నం మాదిగ, షేక్ ఖాజా హుస్సేన్, డివి సాంబశివుడు, ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి ఎన్ సుంకన్న, సయ్యద్ నవీద్, ఎస్ ప్రమీల, డబ్ల్యూ సత్యరాజు, ఎజాజ్ అహ్మద్, జాన్ సదానందం, పాస్టర్లు, సీసీ సంఘసభ్యులు దినకర్ ఐ ఎన్ టి యు సి ఆర్ ప్రతాప్ కాంగ్రెస్ రమేష్ బుజ్జి అక్బర్ మహిళా కాంగ్రెస్ మల్లేశ్వరి శ్రీలత, రమణమ్మ, ఈశ్వరి, రుక్సానా మొదలగు వారు పాల్గొన్నారు.