కార్మికులకు రక్షణగా సీఐటీయూ
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: సంపద సృష్టిలో కీలకపాత్ర పోసిస్తున్న కార్మికులకు, కార్మికుల హక్కులకు వారి ప్రయోజనాలకు అండగా సిఐటియు నిలుస్తుందని సిఐటియు మండల కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు.గురువారం నాడు సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని దేవనకొండ లో సిఐటియు కార్యాలయం దగ్గర మరియు తెర్నేకల్ గ్రామంలో b హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అరుణ పతాకాల ఆవిష్కరణ జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ, 1970 మే 30 న భారతదేశ కార్మికోద్యంలో కీలకమైన మలుపు జరిగిందని కలకత్తా నగరంలో అదే రోజున కామ్రేడ్ జ్యోతి బసు,నండూరి ప్రసాదరావు వంటి మహా ఉద్దండల ఆధ్వర్యంలో సిఐటియు ఆర్భవించిందని, అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా విస్తరించి కార్మిక ఉద్యమంలోనూ అదేవిధంగా కార్మికుల హక్కుల పరిరక్షణలోనూ, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నిలబడి ఉద్యమించిందని చెప్పారు.రాబోయే రోజుల్లో కార్మిక వర్గ రాజ్య స్థాపన లక్ష్యంగా సిఐటియు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవనకొండ ,తెర్నేకల్ సిఐటియు నాయకులు నాగరాజు, రవీంద్రబాబు, ఏలియా, సుధాకర్ ,రంగన్న ,బండ్లయ్య మహేష్, రాముడు, ప్రజా సంఘాల నాయకులు మహబూబ్ బాషా, గాజుల శ్రీనివాసులు, లక్ష్మీరెడ్డి, కెపి రాముడు తదితరులు పాల్గొన్నారు.