ఆర్యూ ప్రాంగణంలో పరిశుభ్రతను కాపాడుకోవడానికి అందరూ కృషిచేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పరిశుభ్రతను కాపాడుకోవడానికి అందరూ కృషిచేయాలని వర్సిటీ వైస్ ఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ పిలుపునిచ్చారు. వర్సిటీ NSS విభాగంవారి ఆధ్వర్యంలో వర్సిటీ ముఖద్వారంవద్ద ఈరోజు నిర్వహించిన పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సువిశాలమైన వర్సిటీ ప్రాంగణంలో పచ్చదనంతో పాటు పరిశుభ్రతకూడా ఉన్నప్పుడే ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడంద్వారా పురుగుపుట్ర రాకుండాకూడా చూసుకోవచ్చన్నారు. ప్రతి విద్యార్థి తనవంతు బాధ్యతగా ఈదిశగా కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖద్వారంవద్ద పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించిన NSS వాలంటీర్లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో NSS కోఆర్డినేటర్ డాక్టర్ పి. నాగరాజు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ వెంకటరత్నం, డాక్టర్ విజయుడు, డాక్టర్ నాగచంద్రుడు, శివప్రసాదరెడ్డితోపాటు విద్యార్థినీ విద్యార్థులు, వివిధ విభాగాల అధ్యాపకులు, ఆచార్యులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.