PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే ఆదేశాలతో చకచకా పనులు..

1 min read

పుస్తకాలు పంపిణీ చేసిన కాత రమేష్ రెడ్డి,ఎస్ఎంసీ వైస్ చైర్మన్

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): ఎమ్మెల్యే ఆదేశాలతో మోడల్ పాఠశాలలో చక చకా పనులు ముందుకు వెళ్తున్నాయ్. నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న మోడల్ పాఠశాలలో గత నెల పదవ తేదీన పాఠశాల ఆకస్మిక తనిఖీకి చేపట్టిన నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య కు పాఠశాల సమస్యల గురించి ఎమ్మెల్యేకు విన్నవించారు.స్పందించిన ఎమ్మెల్యే పాఠశాలలో పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఐదు రోజుల్లోనే పాఠశాలలో బోర్ వేయించారు.తర్వాత నిన్న పాఠశాల రహదారికి విద్యుత్ స్తంభాలను టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో స్తంభాలను వేయించారు.అనంతరం పాఠశాలలో ఇంటర్ ప్రథమ ద్వితీయ విద్యార్థులకు పుస్తకాలను కాతా రమేష్ రెడ్డి,మండల నాయకులు వంగాల శివరామిరెడ్డి, పాఠశాల విద్యా కమిటీ వైస్ చైర్మన్ శివ పార్వతి,పాఠశాల ప్రిన్సిపాల్ సలీం భాష పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు.మధ్యాహ్నం మిడుతూరు ఎస్సైగా బాధ్యత చేపట్టిన ఓబులేష్ ను రమేష్ రెడ్డి శివరామిరెడ్డి తదితర టిడిపి నాయకులు ఎస్ఐ ని కలిసి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వంగాల రమణారెడ్డి,మాజీ ఎంపిటిసి నారాయణ,ఐ టీడీపీ కన్వీనర్ ఇంతియాజ్,లక్ష్మీనారాయణ, చాంద్ బాష మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

About Author