చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసు డ్రోన్ కెమెరాతో గట్టి నిఘా.
1 min readకర్నూలు త్రీ టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో 15 ఒపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలో నేర నివారణే లక్ష్యంగా పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు.ఈ సంధర్బంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని కర్నూలు మూడవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని బిర్లా జంక్షన్ వద్ద చట్ట వ్యతిరేక కార్యకలాపాల పై డ్రోన్ కెమెరా ద్వారా గట్టి నిఘా ఉంచారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 15 మందిని కర్నూలు ట్రాఫిక్ పోలీసులు, కర్నూలు త్రీ టౌన్ పోలీసులు కలిసి అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల పై , బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారి పై నిరంతరం పర్యవేక్షణ నిఘా కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్, కర్నూలు త్రీ టౌన్ ఎస్సై మన్మధ విజయ్, ట్రాఫిక్ ఎస్సై రెహమాన్, ట్రాఫిక్ ఆర్ ఎస్సై హుస్సేన్ పాల్గొన్నారు.