PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మబ్బులు ముసురుకున్నాయి.. రోగాలు ప్రబలుతున్నాయి..

1 min read

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 34;

అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం..

పల్లెవెలుగు వెబ్ గడివేముల : మండల వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి కురుస్తున్న చిన్న పాటి వర్షానికి కాలనీలో ఉన్న సిసి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి బురద మయంగా మారి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విష జ్వరాలతో మంచం పడుతున్నట్టు సమాచారం.. కనీసం వారానికోసారి పారిశుద్ధ్యం చేసే తీరికలేని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చే అధికారి కరువు కావడం ఆడింది ఆటగా పాడింది పాటగా విధులు నిర్వహిస్తున్నారు.. పంచాయతీ కార్యదర్శి కి ఎన్నిసార్లు విన్నవించుకున్న స్పందించడం లేదని. ఎల్కే తాండవాసి కిరణ్ నాయక్ వాపోయాడు.  కొన్నిచోట్ల సొంతంగా సర్పంచులు గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ చేసుకుంటున్నారు గడిగిరేవులలో సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి క్రమం తప్పకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లించడం . పారిశుద్ధ్యం మెరుగుపరచుకోవడం. ఓ హెచ్ ఆర్ ట్యాంకులు క్లోరినేషన్ చేయించుకుంటున్నారు. రంగంలో దిగిన గడివేముల సర్పంచ్ టిడిపి మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణరెడ్డి. జంగిల్ క్లియరెన్స్. బ్లీచింగ్ పౌడర్ రహదారుల వెంబడి చల్లిస్తున్నారు.  ఎల్కే తాండ . బూజునూర్ గ్రామంలో బురదమయంగా మారిన కాలనీ రహదారులు చెరువులు గా మారాయి.. జిల్లా కలెక్టర్ గ్రామాల్లో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య నిర్వహణ ఫాగింగ్ చేయాలని ఆదేశాలిస్తున్న ఇక్కడ పాటించే అధికారులు మాత్రం కంటికి కాన రావడం లేదు జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనకి చేస్తే తప్ప తమ సమస్యలు తీరవని నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని మండల ప్రజలు వాపోయారు.. సమస్యలపై స్పందించడం ఎప్పుడో వదిలేసిన అధికారులు ఇష్టారాజ్యంగా విధులు నిర్వహించడం కోసమెరుపు.

About Author