PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సిఎం జగన్ నైజం

1 min read

పల్లెవెలుగు వెబ్  హొళగుంద:  ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన ఘనత సిఎం జగన్మోహన్రెడ్డిదేనని ఆలూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన హొళగుందలో స్థానిక బస్టాండ్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన విరుపాక్షికి వైకాపా నాయకులు, కార్యకర్తలు గజమాలతో మనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబునాయుడు 14ఏళ్ల కాలంలో చేయలేని అభివృద్ధి జగనన్న ఐదేళ్లలో చేసి చూపించారన్నారు. చంద్రబాబు హయాంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంక్షేమ భగీరథుడని ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించారన్నారు. వైసిపి పాలనలో విద్య,వైదయం,వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేకలు మార్చిన ఘనత సీఎం జగన్దేనన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి ముద్దుబిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారన్నారు. చంద్రబాబునాయుడు కూటమితో జతకట్టి ముస్లిం మైనార్టీలకు ఉన్న 4శాతం రిజర్వేషన్ను కూడా రద్దు చేస్తామని చెబుతున్నారన్నారు. సిఎం జగన్ అధికారంలోకి రాగానే 4శాతం ఉన్న రిజర్వేషన్ను 6శాతానికి పెంచి మైనార్టీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సిఎం జగన్ నైజం అన్నారు. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం అలూరు నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. తాగునీరు, సిసిరోడ్లు కూడా వేయలేదన్నారు. ఆలూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి జయరాంకు పలుకుబడి ఉంటే వైసిపి పార్టీలో టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా నిలబడి ఉంటే తన సత్తా..నా సత్తా.. ఏంటో తెలిసేదన్నారు. హొళగుంద మండల ప్రజలు వైసిపి అత్యధిక మెజార్టీ ఇచ్చారని రానున్న ఎన్నికల్లో అదేమాదిరిగా మంచి మెజార్టీ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసిపి అభ్యర్థులను గెలిపించాలన్నారు. కర్నూలు ఎంపి అభ్యర్థి బీవై రామయ్య, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మండలంలో దాదాపు 300కుటుంబాలు వైసిపిలో చేరినట్లు తెలిపారు. వీరికి పార్టీ కండువాలు వేసి పార్టీకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ సురేంద్రరెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, శశికళ కృష్ణమోహన్ దంపతులు, హెబ్బటం నవారి, రాఘవేంద్రరెడ్డి, పెద్దగోనెహాల్ వెంకటరెడ్డి, గోపాల్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, ఎంపిపి తనయుడు ఈసా, మండల కన్వినర్ షఫీవుల్లా, సర్పంచ్ తనయుడు వంపాపతి, ఎస్కె గిరి, విరుపాక్షి సోదరుడు శ్రీరాములు, మార్లమడికి చంద్ర, సిద్ధట్టి, యువ నాయకులు దర్గప్ప, రహంతుల్లా, షేక్షావలి, నూరుల్లా, నలాం, ప్రేమవర్షన్రెడ్డి, స్కూల్ చైర్మన్ జొండే సిద్ధయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author