PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిది   – ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం  కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాం కుమార్ స్థానిక టిడిపి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. సీఎం సహాయనిది పేదలకు పెన్నిదని ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ ఈ సందర్భంగా అన్నారు. వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులు అందిస్తున్నారన్నారు. పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని పదిమందికి తొమ్మిది లక్షల 88 వేల రూపాయలను సీఎం రిలీఫ్ పండు చెక్కులను బాధితులకు ఆయన అందజేశారు. కష్ట కాలంలో తమకు ఆర్థిక సహాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు మరియు ఎమ్మెల్యే కే ఈ శ్యాంకుమార్ కు లబ్ధిదారులు ప్రత్యేక ధన్య వాదాలు తెలియజేశారు.

లబ్ధిదారుల వివరాలు ఎలా ఉన్నాయి.

1) వి.ఓబులేసు పుచ్చకాయలమాడ గ్రామం             1,64,174  రూ.లు.  2) శ్రీనివాసులు బురుజుల గ్రామం 1,45,460  3)సి.సునీల్ కుమార్ ఏడవలి గ్రామం 55,000, 4) వై.ఎర్రమ్మ డోన్ 1,04,005,5) సి అనసూయమ్మ పెండేకల్ గ్రామం 59,350 ,6) కె శ్రీకాంత్ పుచ్చకాయలమాడ గ్రామం 1,00,527,7)జే సుంకమ్మ దూదేకొండ గ్రామం 20,273 ,8) ఎం.రామ గోవిందు హంప గ్రామం 1,01,299,9) ఎం.రఘు బాబు పత్తికొండ టౌన్ 37,853,10) విష్ణువర్ధన్ రెడ్డి బొల్లవానిపల్లి గ్రామం .

About Author