తిరుపతి ఘటనకు సీఎం బాధ్యత వహించాలి: ఆలూరు ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు : తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం, టీటీడీ మధ్య సరైన చర్చలు లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని విమర్శించారు. ఒక అవగాహన లేని వ్యక్తికి టీటీడీ ఛైర్మన్ కట్టబెట్టడం, కూటమి నాయకుల ప్రచార పిచ్చి వల్ల పేద ప్రజల ప్రాణాలను బలిగొన్నారని ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.