PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డి ఎస్సి, టీటీసీ, నవోదయ .. గురుకుల కోచింగ్ సెంటర్ల పై చర్యలు తీసుకోవాలి

1 min read

ఆర్ పి ఎస్ ఎఫ్, ఆర్ యూ ఎస్ ఎఫ్

పల్లెవెలుగు వెబ్   ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న  డి ఎస్సి, టీటీసీ, నవోదయ మరియు గురుకుల కోచింగ్ సెంటర్ల పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది, ఆర్ యూ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్ లు స్థానిక ఏం ఈ ఓ -2 మధుసూదన్ రాజు గారికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడతూ ఎమ్మిగనూరు పట్టణం లో డి ఎస్సి, టీటీసీ కోచింగ్ సెంటర్లో సరైన మౌలిక వసుతులు లేకున్నా, అలాగే వివిధ సబ్జెక్టులు కు సరైన స్టాఫ్ లేక పోయిన ఉన్నట్లు పంపిలేట్ మరియు బ్యానర్లలో  వేస్తు నిరుద్యోగులు ను మోసం చేస్తున్నారు, నెలకు పది వేలు నుంచి పదాయిదు వేలు వసూలు చేస్తూ నిరుద్యోగలను నిలువ దోపిడీ చేసుకుంటున్నారు అని వారు అన్నారు . నవోదయ మరియు గురుకుల కోచింగ్ సెంటర్ లో అయితే ప్రభుత్వం వ్యతిరేకం గా బడి సమయం లో పాఠశాలలో ఉండాల్సిన విద్యార్థులు ఇ కోచింగ్ సెంటర్లో ఉంటున్నారు, మరియు ముఖ్యం నాకు కోచింగ్ సెంటర్ అయితే గవర్నమెంట్ టీచర్నడపటం జరుగుతుంది అన్ని ఇ కోచింగ్ సెంటర్లు సంవత్సరంలో కేవలం ఆరు లేదా ఏడు నెలలు ఉంటుంది అని కానీ విద్యార్థుల తల్లితండ్రులు నుంచి  మాత్రం 50 వేలు నుంచి 60 వేలు వరకు వసూలు చేస్తున్నారు, ఇలాంటి కోచింగ్ సెంటర్ల పై విచారణ జరిపి సిజ్ చేయాలి అని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డి ఇ ఓ మరియు కలెక్టర్ కీ ఫిర్యాదు చేస్తాము అని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మహబూబ్, నవీన్ పాల్గొన్నారు.

About Author