కేసీ కెనాల్ లో కొక్లైన్ తో పూడిక తీత పనులు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : వరి సాగు కొరకు కేసి కెనాల్ కు అధికారులు నీరు వదిలిన సందర్భంగా కేసీ కెనాల్ లో వ్యర్ధాలు, పిచ్చి మొక్కలు ఉండడంతో రైతులు స్వచ్ఛందంగా కేసి కెనాల్ లో ఉన్న వ్యర్థాలను, పిచ్చి మొక్కలను మంగళవారం కొక్లైన్ సహాయంతో తొలగించడం జరిగింది, కేసి కెనాల్ కింద మండలంలోని శివాలపల్లె నుండి, ఓబులంపల్లె, గుర్రంపాడు వరకు రైతులు వందలాది ఎకరాలలో వరి సాగు కు సన్నద్ధమయ్యారు అయితే కేసీ కెనాల్ లో పిచ్చి మొక్కలతో, వ్యర్థాలతో కాలువ పూడిపోవడంతో దిగువకు నీరు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవగా రైతులు స్వచ్ఛందంగా తమ పొలాలకు నీళ్లు వెళ్లేందుకు వీలుగా కేసీ కెనాల్ లోని వ్యర్థాలను తొలగించడం జరిగింది. అలాగే కేసీ కెనాల్ లో కొంతమంది ప్లాస్టిక్ వ్యర్థాలను, గాజు సీసాలను వేయడం ద్వారా రైతులకు చాలా ఇబ్బందికరంగా ఏర్పడుతుందని, వరి పంట పొలాలలోకి వ్యర్థాలు చేరడం వల్ల తీవ్ర అసౌకర్యమే కాకుండా పంట పొలాలు దెబ్బతినడం జరుగుతుందని రైతులు తెలిపారు. అదేవిధంగా కొంతమంది ఆకతాయిలు మద్యం సేవించి మద్యం బాటిళ్లను పగులగొట్టి కాలువలలో వేయడం వల్ల అవి రైతుల పొలాల్లోకి వెళ్లి పొలంలోకి వెళ్లిన రైతులకు, రైతు కూలీలకు గుచ్చుకొని గాయాల పాలు అవుతున్నారని, దయవుంచి ఎవరు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను గాని, గాజు సీసాలను గాని కాలువలో వేయరాదని రైతులు కోరుతున్నారు.