PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలెక్టర్​ కు మెమోంటో అందజేత

1 min read

కర్నూలు హెల్త్​ క్లబ్​ కు రావాలని సభ్యుల వినతి

కర్నూలు, పల్లెవెలుగు:ప్రపంచ హృదయ దినోత్సవం (సెప్టెంబరు 29న ) సందర్భంగా కలెక్టరేట్​ లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన  కార్యక్రమం విజయవంతమయ్యేందుకు పూర్తిగా సహకరించిన కలెక్టర్​ , కర్నూలు హెల్త్​ క్లబ్​ చైర్మన్​ పి. రంజిత్​ బాషా కు కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కలెక్టర్​ పి. రంజిత్​ బాషాను ఆయన ఛాంబరులో హెల్త్​ క్లబ్​ ప్రధాన కార్యదర్శి , ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ నేతృత్వంలో కమిటీ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ కు వరల్డ్​ హార్ట్​ డే కు సంబంధించిన మెమోంటోను అందజేశారు. అనంతరం హార్ట్​ ఫౌండేషన్​  ఆధ్వర్యంలో నిర్వహించే హెల్త్​ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రావాలని కమిటీ ప్రధాన కార్యదర్శి డా. చంద్రశేఖర్​ కలెక్టర్​ కు విన్నవించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు డా. భవాని ప్రసాద్​ , చంద్రశేఖర్​ కల్కూర తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *