కలెక్టర్..జేసీకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారిని శనివారం సాయంత్రం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మర్యాద పూర్వకంగా కలిశారు.నూతన సంవత్సర సందర్భంగా కలెక్టర్ కు ఎమ్మెల్యే మరియు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి పుష్పగుచ్చం అందజేస్తూ శుభకాంక్షలు తెలిపారు. తర్వాత జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ ను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.అదే విధంగా నందికొట్కూరు నియోజకవర్గ సమస్యల గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు.