ఐసిడిఎస్ సిడిపిఓ, సూపర్వైజర్ లతో కలెక్టర్ సమీక్ష
1 min readగర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు చేపట్టండి
మహిళ, శిశు అభివృద్ధి వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ శాఖల సెక్రటరీ శ్రీమతి ఏ.సూర్య కుమారి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని మహిళ, శిశు అభివృద్ధి వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ శాఖల సెక్రటరీ శ్రీమతి ఏ.సూర్య కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఉదయం సునయన ఆడిటోరియంలో వివిధ ఐసిడిఎస్ అంశాల అమలు పై మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణు గోపాల్ రెడ్డి తో కలిసి మహిళ, శిశు అభివృద్ధి వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ శాఖల సెక్రటరీ ఐసిడిఎస్ సిడిపిఓ, సూపర్వైజర్ లతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా సెక్రెటరీ మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్ లోని పిల్లలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములు మంచి పోషకాహారాలు అందిస్తున్నారన్నారు.. ఈ పోషకాహారం తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు రక్తహీనత, బరువు తక్కువ వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నారు.. కావున అంగన్వాడి సెంటర్ లలో ఉన్న టీచర్లు, హెల్పర్లు నిబద్ధతతో పనిచేసి గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు పోషకాహారము సక్రమంగా అందజేయలన్నారు.. అదే విధంగా పోషకాహారమే కాకుండా చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యంగా ఉండే విధంగా పలు సూచనలు ఎప్పటికప్పుడు వారికి తెలియజేస్తూ వారిని ఆరోగ్యంగా ఉంచే విధంగా సూపర్వైజర్లు, సిడిపివో లు సక్రమంగా బాధ్యత నిర్వహించాలన్నారు.. దేశంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లలో కంటే మన రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్లలో మంచి పోషకాహారం అందించడం జరుగుతుందన్నారు.. చిన్నపిల్లల మెదడు 1000 రోజుల లోపల అభివృద్ధి చెందుతుందని, అంత లోపల పిల్లలకు సరైన పోషకాహారము అంగన్వాడీ కేంద్రాలలో అందించాలన్నారు..తల్లి విద్యావంతురాలు అయితే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు.జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు, బాలింతలు, చిన్న పిల్లలకు అందించే పోషకాహారం నాణ్యతగా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు..సమావేశంలో ఐసిడిఎస్ పిడి నిర్మల, సిడిపిఓలు సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.