రాఘవేంద్ర నగర్ కాలనీవాసులకు తాగునీరు ఇవ్వాలి: సిపిఎం
1 min readమున్సిపల్ కమిషనర్ కు సిపిఎం ఆధ్వర్యంలో వినతి పత్రం అందిస్తున్న సిపిఎం నాయకులు
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణం 32 వ వార్డు సంజీవ్ నగర్ ప్రక్కనున్న రాఘవేంద్ర నగర్ లో త్రాగునీటి సమస్య కొరకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని సిపిఎం పార్టీ నాయకులు పి. గోవిందు, బి. రాముడు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం సోమవారం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 14 తర్వాత ఎమ్మిగనూరు మున్సిపాలిటీ సిబ్బంది ఎమ్మిగనూరు పట్టణ వాసులకు రోజు మరిచి రోజు త్రాగునీరు ఇస్తున్నారని తెలిపారు. పట్టణ శివారులో ఉన్న స్లమ్ ఏరియాలకు తాగునీటి పైప్లేన్ కూడా వేయలేదని వారి ఆరోపించారు. 32 వ వార్డు సంజీవ్ నగర్ పక్కన ఉన్న రాఘవేంద్ర నగర్ ప్రజలకు మంచినీటి పైప్ లైన్ ఇప్పటివరకు వేయలేదు అన్నారు. ఆ కాలనీ వాసులకు నీళ్ల ట్యాంకుల ద్వారా త్రాగునీరు అందిస్తున్నారు. అయితే అందరికీ నీళ్లు అందడం లేదు. అదనంగా తాగునీటిని ట్యాంకుల ద్వారా సరాపర చేయాలని మున్సిపల్ కమిషనర్ను కోరారు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి మాట్లాడుతూ త్వరలోనే రాఘవేంద్ర నగర్ కు మంచినీటి పైప్లైన్ వేయిస్తామని తెలియజేశారు. అలాగే ఆ కాలనీ వాసులకు సరిపోయేంత త్రాగు నీరు ట్రాక్టర్ నీళ్ల ట్యాంకుల ద్వారా అందజేస్తామని తెలియజేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో త్రాగునీటి సమస్య జటిలం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం స్థానిక నాయకులు తిమ్మప్ప, స్థానిక మహిళలు పాల్గొన్నారు.