PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిరుత బంధించడానికి త్వరలో ఆదేశాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మహానంది క్షేత్రం చుట్టూ తిరుగుతున్న చిరుత బంధించడానికి  త్వరలో ఆదేశాలు వెలబడనున్నట్లు విశ్వాసనీయ సమాచారం.. దాదాపు నాలుగు ఐదు సార్లు చిరుత సంచారం మహానందిలోని గోశాల మరియు దాని పరిసర ప్రాంతాల నందు తరచూ సంచరిస్తూ అటు భక్తులను మరియు స్థానికుల తో పాటు అటవీ, దేవస్థాన ఇబ్బందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందో అని భయాందోళనలతో భయం భయంగా మహానందికి వచ్చే భక్తులతో పాటు స్థానికులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది. అటవీ శాఖ ఉన్నతాధికారులు కూడా మహానంది క్షేత్ర పరిసర ప్రాంతాలను పరిశీలించి మహానంది క్షేత్ర వెనుక భాగం వైపు ముఖ్యంగా గోశాల మరియు మాడవీధుల గుండా జన సంచారం లేకుండా చూడాలని ఆలయ అధికారులకు సూచించారు. ఇవన్నీ పక్కన పెడితే చిరుత రెండు మూడు రోజులకు ఒకసారి రాత్రులు మహానంది క్షేత్ర పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండడంతో అటవీ శాఖ చిరుతను బంధించడానికి ఒక ప్రణాళిక రహస్యంగా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా వన్యప్రాణులు అటవీ ప్రాంతంలో కానీ అటవీ ప్రాంతం పరిసర ప్రాంతాల్లో మైదాన ప్రాంతానికి దగ్గరలో  కానీ సంచరిస్తున్న నిర్బంధించడానికి అటవీ చట్టాలు అడ్డు పడుతున్నట్లు సమాచారం. వీటన్నింటినీ పక్కన పెడితే చిరుత సంచారం మహానంది క్షేత్రం చుట్టూ ఉండడంతో ఎవరి పైన అయినా దాడి చేస్తే అటవీ శాఖకు చెడ్డ పేరు వస్తుందని భావనతో దానిని ఇతర చోట్లకు తరలించడానికి రహస్యంగా పావులు కదుపుతున్నట్లు  తెలుస్తుంది.

About Author