బాధ్యతగల పదవిలో ఉండి సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం..
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా ప్రభుత్వంలో కీలక పదవి నిర్వహిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి వైసిపి ఏజెంట్లకు రూల్స్ పాటించొద్దని సలహా ఇవ్వడం చాలా దారుణం అని టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి లాయర్ బాబు తెలిపారు గురువారం నాడు ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన రూల్స్ ను అడ్డుకోవడమే అవుతుందని రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవి బాధ్యతలు నిర్వహిస్తూ ఒక నియంతలాగా వ్యవహరించడం తగదన్నారు వైసీపీ ఏజెంట్లను రూల్స్ పాటించొద్దని రెచ్చగొట్టడం ఎన్నికల కమిషన్ నిబంధనలను వ్యతిరేకించడం అవుతుందన్నారు . రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఎన్నికల కౌంటింగ్ లో ఏం జరిగిన సజ్జల రామకృష్ణారెడ్డి నీ బాధ్యుని చేయాలన్నారు . రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఉద్దేశంతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకున్నారు కాబట్టి జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ లో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలు అఖండ విజయం సాధించి రాష్ట్రంలో జూన్ 9వ తేదీన ఉమ్మడి పార్టీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.