నీటి ప్రాంతాన్ని పరిశీలించిన కమిషనర్,వైస్ చైర్మన్
1 min readఇళ్లల్లోకి వర్షపు నీరు తడిసిన ధాన్యం-నందికొట్కూర్ లో భారీ వర్షం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గురువారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షం పట్టణంలో మారుతి నగర్ మరియు 14వ వార్డులో వర్షం నీళ్ళు తీవ్రంగా రావడంతో గురువారం ఉదయం ఆయా కాలనీల్లో రోడ్ల వెంట నీళ్లు విపరీతంగా వచ్చాయి..విషయం తెలుసుకున్న నందికొట్కూరు మున్సిపాలిటీ కమిషనర్ బేబీ మరియు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ,14వ వార్డు కౌన్సిలర్ అశోక్ కాలనీలో వర్షం నీటిలో నడుచుకుంటూ కాలనీ ప్రజలతో వారు మాట్లాడారు. కాలనీవాసులకు వారు ధైర్యం చెప్పారు.అదేవిధంగా 14వ వార్డులో ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో బియ్యం తదితర ధాన్యం తడిసి పోయిందని కాలనీ వాసులు కమిషనర్ కు మరియు విఆర్ఓ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువచ్చారు.ధాన్యం తడిసిపోయిన వారి ఆధారు బియ్యం కార్డు జిరాక్స్ లను మాకు ఇస్తే వాటి వివరాలను ప్రభుత్వానికి పంపిస్తామని వీఆర్వో కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.14వ వార్డులో డ్రైనేజీ కాలువలు చిన్నగా ఉండటం వల్ల నీళ్లు వెళ్ళలేక పోతున్నాయని పెద్ద కాలువలు చేపడితే నీళ్లు వెళ్లడానికి సులువుగా ఉంటుందని కౌన్సిలర్ మానపాటి అశోక్ కమిషనర్ కు తెలిపారు. కమిషనర్ మరియు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కాలనీలో ఉంటూ పారిశుధ్య కార్మికులతో నీళ్లు వెళ్ళే విధంగా దగ్గరుండి చేయించారు.ఇళ్లల్లోకి నీళ్లు వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునే విధంగా చూస్తామని మున్సిపాలిటీ కమిషనర్ బేబీ మరియు వైస్ చైర్మన్ రబ్బానీ కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు.