కాలనీలో పర్యటించిన కమిషనర్..వైస్ చైర్మన్
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మరియు శనివారం తెల్లవారు జామున కురిసిన వర్షానికి ఎస్ ఎస్ఆర్ నగర్ 25 వ వార్డులో ఆత్మకూరు బైపాస్ రోడ్ టర్నింగ్ దగ్గర భారీగా వర్షం నీళ్లు ఉండడంతో ప్రయాణికులు పట్టణ ప్రజలు చాలా ఇబ్బందులకు గురి గురు అయ్యారు ఈ విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ కమిషనర్ బేబీ మరియు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ వెంటనే వర్షపు నీళ్ళు ఉన్న ప్రాంతాన్ని కమిషనర్ మరియు వైస్ చైర్మన్ పరిశీలించారు.ఆ కాలనీలో ఉన్న డ్రైనేజీ కాలవల్లో వర్షం నీళ్లు రావడం వల్ల చెత్తా చెదారం ఉండడం వల్ల నీళ్లు కాలువల్లో వెళ్లక పోవడంతో కాలనీలో రోడ్లమీద నీళ్లు ప్రవహిస్తూ ఉండగా వెంటనే మున్సిపాలిటీ కార్మికులతో డ్రైనేజీ కాలువల్లో ఉన్న చెత్తా చెదారాన్ని శుభ్రం చేయించారు.మున్సిపాలిటీ కమిషనర్ మరియు వైస్ చైర్మన్ ఉదయం నుండి అక్కడే ఉంటూ వారు పనులను పరిశీలిస్తూ నీళ్లు వెళ్లే విధంగా కార్మికులతో శుభ్రం చేయించారు. అదేవిధంగా కమిషనర్ మరియు వైస్ చైర్మన్ రబ్బానీ కాలనీలో ఉన్న ప్రజలతో మాట్లాడారు. కాలనీని శుభ్రం చేయించడం పట్ల కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ సచివాలయ శానిటేషన్ అధికారులు,4 వ సచివాలయ అడ్మిన్,5వ వార్డ్ ఇంచార్జ్ సన అబ్దుల్లా,టిడిపి సోషల్ మీడియా ప్రతినిధి పసుల శ్రీనివాసులు నాయుడు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.