పాఠశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది…
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికై తగిన చర్యలు తీసుకుంటున్నాం..గతంలో ఎన్నడూ లేని విధంగా పండుగల మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం.తెదేపా ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ పాఠశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థులు అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి చెందడానికి కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆలూరు నియోజకవర్గం తెదేపా ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మెగా ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశానికి తెదేపా ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇన్చార్జి వీరభద్ర గౌడ్ కు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు ఘన స్వాగతం పలికారు.ముందుగా పాఠశాలలో విద్యార్థుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన తాగునీటి ట్యాంకును ఇన్చార్జి వీరభద్ర గౌడ్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వీరభద్ర గౌడ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి విద్యారంగంలో ఎన్నో మార్పులు చేస్తూ విద్యారంగ అభివృద్ధికి పాటుపడుతుందని అన్నారు. కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ మెగా ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించడం హర్షణీయమని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు విద్యనభ్యసిస్తున్న పాఠశాలల అభివృద్ధిలో భాగం కావాలని అన్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఇంకా ఏమైనా వసతులు అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని, విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. విద్యార్థుల కోసం తెదేపా ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ తనవంతుగా 21 డెస్క్లను విరాళంగా ప్రకటించారు. దీంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కరతాళ ధనులతో వీరభద్ర గౌడు కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు తగిన వసతులు కల్పిస్తూ విద్యారంగ అభివృద్ధికై కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయుడు నజీర్ అహ్మద్, పాఠశాల ఉపాధ్యాయులు,విద్యా కమిటీ చైర్మన్ ద్వారకానాథ్,విద్యా కమిటీ సభ్యులు,తెదేపా సీనియర్ నాయకులు రాజా పంపన్న గౌడ్, అబ్దుల్ సుభాన్, డి ఎస్ భాషా, మురళి, పంపాపతి, దిడ్డి వెంకటేష్, ఎర్రి స్వామి, సిబిఎన్ ఆర్మీ ముల్లా మోయిన్, విద్యా కమిటీ మెంబర్ వలి,సలీం, తిక్కస్వామి, మల్లి,అబ్దుల్ రెహమాన్,సుబాన్ తదితరులు పాల్గొన్నారు.