విద్య ద్వారానే సమాజాభివృద్ధి.. జిల్లా విద్యాశాఖ అధికారి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: విద్య ద్వారానే సమాజ అభివృద్ధి జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ శామ్యాల్ పాల్ అన్నారు. జొహరాపురం లోని భవిత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సుందరయ్య స్ఫూర్తికేంద్రం మరియు సిఐటియు కేవీపీఎస్ 5వ పి ఎస్ ఎన్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు కరాటే శిక్షణ పొందిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. పిఎస్ఎన్ జిల్లా కన్వీనర్ అమర్ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈవో ఎస్ శామ్యూల్ పాల్ యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కేసురేష్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రంగప్ప సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నగర నాయకులు ఎం రాజశేఖర్ సిఐటియు ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్ భవిత స్కూల్ కరస్పాండెంట్ నరేంద్ర లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ సుందరయ్య జీవితంలో కులం మతం పేద ధనికన్న భేదాలు లేవంటూ తన పేరును సైతం మార్చుకున్న వ్యక్తి అని అన్నారు ఈ దేశంలో పార్లమెంటుకు సైకిల్ పై వెళ్లిన మొట్టమొదటి వ్యక్తి సుందరయ్య అని కొనియాడారు సుందరయ్యస్ఫూర్తి కేంద్రంలో కులమత బేధాలు లేకుండా సర్వ మతాల పండుగ సంక్రాంతి అన్నట్టు మహిళలలో చైతన్య నింపుతూ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. పేద విద్యార్థులకు కరాటే శిక్షణ నేర్పించడం చాలా గొప్ప విషయం అన్నారు. అనంతరం కరాటే లో శిక్షణ పొందిన విద్యార్థుల ప్రదర్శన వీక్షించి విద్యార్థులతో మాట్లాడుతూ కేవలం శరీరాన్ని మాత్రమే దృఢంగా చేసుకోవడంతో పాటు విజ్ఞానాన్ని కూడా పెంచుకోవాలన్నారు. అలాగే కరాటే బెల్ట్ గ్రేడింగ్ కార్యక్రమాన్ని వన్‌టౌన్ సీఐ రామనాయుడు సుందరయ్య స్ఫూర్తి కేంద్రం జిల్లా కన్వీనర్ డి గౌర్ దేశాయ్ విచ్చేసి ప్రారంభించి విద్యార్థులను అభినందించారు. అనంతరం కరాటే లో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మెమొంటోలు సర్టిఫికెట్లనుఅందజేశారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను ప్రధానం చేశారు. అలాగే విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో యూనివర్సల్ కరాటే శిక్షణ కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాసులుమాస్టర్ సుధాకర్ సిఐటియు నగర నాయకులు రంగస్వామి, ఆటో యూనియన్ నాయకులు మైమూడ్, నాగరాజు కె.వి.పి.ఎస్ నగర్ నాయకులురమణ ఐద్వానాయకులు కమ్రుణ్ తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.