PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ వైద్యశాలపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కి ఫిర్యాదు

1 min read

బిజెపి మండల అధ్యక్షుడు గాడి భాస్కర్

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  చెన్నూరు మండల ప్రజలను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం భావన నిర్మాణ పనులు చేపడుతున్న సామాజిక ఆరోగ్య కేంద్రం( సి ఎస్ సి) అలాగేచెన్నూరులో నడుస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ కు చెన్నూరు మండల బిజెపి అధ్యక్షుడు గాడిభాస్కర్ గురువారం ఫిర్యాదు చేయడంతో పాటు ప్రభుత్వ వైద్యశాలపై వినత పత్రం మంత్రికి అందజేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రం 30 పడకల నూతన భవనం గత ప్రభుత్వంలో మంజూరు కాగా ఇందుకు నాలుగు కోట్ల 70 లక్షలు ఖర్చుతో భవన నిర్మాణ పనులు చేపట్టారు. భవన నిర్మాణ పనులు గత నాలుగు సంవత్సరాలుగా చేపడుతున్నప్పటికీ ఇప్పటివరకు పూర్తికాలేదు. ప్రస్తుతం సామాజిక ఆరోగ్య కేంద్రం రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్లో అరకొర వసతుల మధ్య నడుస్తున్నది. ప్రతిరోజు వందల సంఖ్యలో రోగులు వస్తుండడంతో వైద్య సేవలు అందక అరకొర వసతులతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. వైద్య సిబ్బంది కొరత వైద్యులు మందులు కొరత కారణంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) కొండపేట గ్రామంలో ఏర్పాటు చేయకుండా చెన్నూరు మండల అభివృద్ధి కార్యాలయంలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నడుపుతున్నారు. కొండపేట గ్రామంలో నూతన భవనం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టవలసి ఉంది. కొండపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం వలన కొండ పేట. కనుపర్తి. బలిసింగాయపల్లి. దవళతాపురం. ఎస్టీ రామాపురం. కైలాసగిరి ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి సత్య కుమార్ యాదవ్ దృష్టికి తెచ్చారు. సామాజిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులు పూర్తి చేసి వెంటనే వైద్యులు వైద్య సిబ్బంది ని ఏర్పాటు చేయాలని సూచించారు. కొండపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులు చేపట్టి ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కొండపేట గ్రామానికి తరలించాలని మంత్రి దృష్టికి తెచ్చారు.

About Author