PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రీ సర్వేలో దిద్దుబాటు పనులను నవంబర్ 30 లోపల పూర్తి చేయండి

1 min read

సియంఓ ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ చూపండి

ఫ్రీ హోల్డ్ భూముల ప్రక్రియపై జాగ్రత్తలు తీసుకోండి

 రెవెన్యూ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: రీ సర్వేపై వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దిద్దుబాటు పనులను నవంబర్ 30 లోపల పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రెవెన్యూ అధికారులు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ అంశాలపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, డిఆర్ఓ ఎ.పద్మజ, ఆర్డీఓలు మల్లికార్జున్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఎం. దాసు అన్ని మండలాల తాసిల్దారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ 211 గ్రామాలలో రీ సర్వే పూర్తయిందని… రీ సర్వేలో భూ సమస్యలకు సంబంధించి వచ్చిన  ఫిర్యాదులను ప్రాధాన్యతగా తీసుకొని దిద్దుబాటు పనులను నవంబర్ 30 లోపల పూర్తి చేయాలని మండల తహసీల్దార్లు ను ఆదేశించారు. సిఎంఓ కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్యతగా తీసుకొని పెండింగ్ లో వున్న 9 సమస్యలను పరిష్కరించలాన్నారు. సీఎంఓ ఫిర్యాదులు రీఓపెన్ అయితే సంబంధిత కారణాలను వివరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులలో రెవెన్యూ శాఖకు సంబంధించి 630 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని బియాండ్ ఏస్ఎల్ఏ లోగా పరిష్కరించాలని మండల తాసిల్దారును ఆదేశించారు. ఎస్ఎల్ఏ సమయం ముగిసే సమయానికి పరిష్కరించడం వల్ల నాణ్యతగా ఉండడం లేదన్నారు. ఫిర్యాదుదారులకు అర్థమయ్యే రీతిలో తెలుగులో అర్థవంతంగా  వ్రాసి ఎండార్స్ ఇవ్వాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి అంకితభావంతో ఒకరోజు కేటాయించుకొని సంబంధిత ఫిర్యాదులను క్లియర్ చేయాలన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ప్రభుత్వానికి నివేదించిన 65,380 ఎకరాలో 14,214 ఎకరాలు డివియేషన్ చేసినట్లు పేర్కొన్నారని ఇందుకు సంబంధించి గ్రామ, మండల , సర్వే నంబర్ల వారీగా నివేదికలు ఇవ్వాలన్నారు. ఇందులో 1652 ఎకరాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా  పూర్తయినట్లు తెలిపారు. జిల్లాలో నిబంధనలు పాటించకుండా ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగిందని ఇందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు కూడా సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. 264 ఎకరాలు సర్వీస్ ఇనాం భూములకు కూడ డీవియేషన్ నివేదికలు ఇచ్చారని అందుకు గల కారణాలను వివరించాలన్నారు. ఆర్ఓఆర్ కేసులకు సంబంధించి ఎండార్స్ ఇవ్వకుండా స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు.జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ మాట్లాడుతూ రీ సర్వే పనులు పూర్తి చేయడంతో పాటు కోర్టు కేసులకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. 25 కంటెంప్ట్ కేసులు, 14 లోకాయుక్త కేసులు ఉన్నాయని వెంటనే క్లియర్ చేయాలని జేసీ ఆదేశించారు. 261 సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా వచ్చేనెల 6వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు. స్మశాన వాటికలకు సంబంధించి స్థలాలను గుర్తించి సంబంధిత నివేదికలను అందజేయాలని సూచించారు.

About Author