క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం…
1 min readనగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జీ.వీ. కృష్ణ
పల్లెవెలుగు వెబ్ కల్లూరు/కర్నూలు: మంగళవారం ప్రతిరోజు అరగంట పాటు క్రీడా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఆర్.జీ.వి. క్రిష్ణ అన్నారు. మంగళవారం స్థానిక చెక్పోస్ట్ సమీపంలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నందు వార్షిక క్రీడా దినోత్సవం పురస్కరించుకొని, విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జీ.వి. క్రిష్ణ హాజరై, విజేతలకు ప్రశంస పత్రాలు, బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే క్రీడలను అలవాటుగా అలమరుచుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు ఎంతో అవసరమన్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.ప్రిన్సిపల్ పాయల్ ప్రియదర్శిని మాట్లాడుతూ వార్షిక క్రీడా దినోత్సవంలో భాగంగా విద్యార్థులకు ఖోఖో, వాలీబాల్, బాస్కెట్ బాల్, టగ్ ఆఫ్ ఫర్ (తాడు లాగటం), 50 మీటర్ల పరుగుపందెం వంటి క్రీడా పోటీలను నిర్వహించామని, దాదాపు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. క్రీడలు ఆత్మస్థైర్యానికి దోహదపడతాయని, తమ విద్యాలయంలో విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంపునకు అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.కార్యక్రమంలో పిఈటి టీచర్లు బాదల్, వజ్రా రాజు, తదితరులు పాల్గొన్నారు.