PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరు జిల్లా పోలీస్ అఫీషియల్ వెబ్సైట్ లో పూర్తి సమాచారం

1 min read

గోడపత్రికను ఆవిష్కరించిన ఏలూరు జిల్లా ఎస్పీ  కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్

మహిళల రక్షణ కొరకు మరింత భద్రత,సమాచారం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా పోలీస్ అఫీషియల్ వెబ్సైట్ నందు మహిళల యొక్క రక్షణ, భద్రత కొరకు  సమాచారం ఈ వెబ్సైట్ పూర్తి సమాచారం లబ్యత కొరకు గోడపత్రికలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న సైబర్ మోసాలు వాటి యొక్క వివరాలు గురించి తదుపరి వాటి నివారణ కొరకు ఏలూరు పోలీస్ డిపార్ట్మెంట్  నిర్వహిస్తున్న అవగాహన కు సంబంధించి వివరాలను ఈ వెబ్సైట్ ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు.పోలీసు వారి యొక్క పౌరు సంబంధాల గురించి ఈ వెబ్ సైట్ నందు ఏలూరు జిల్లా కి సంబంధించిన సోషల్ మీడియా సైట్లు వివరాలు అందుబాటు లో ఉంటాయన్నరు. జిల్లా పోలీసు  నిర్వహించె పనులన్ని పొందుపర్చినట్లు వివరించారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నటువంటి నేరాలను గురించి ప్రజలకు అవగాహన కొరకు యూట్యూబ్ ద్వారా మరియు సోషల్ మీడియా ద్వారా చేసే ప్రచారాలను తెలియజేయుట కొరకు వినియోగ పడతాయని తెలిపారు. ప్రజలకు అవసరమైన జిల్లా పోలీసు యొక్క సమగ్ర సమాచారం పోలీస్ స్టేషన్ ల యొక్క సమాచారం, పోలీస్  ఆఫీసర్ యొక్క సమాచారం మొబైల్ నెంబరులు అన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగిందన్నరు.ఈ వెబ్సైట్ నందు జిల్లా పోలీస్ సిబ్బంది కి అవసరమైన సమాచారాన్ని అందుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్ర రావు, నూజివీడు డిఎస్పీ  ప్రసాద్, ఎన్. ఐ సి ఇన్చార్జి స్వామి, ఏలూరు జిల్లా ఐ.టి ఇన్చార్జి ఆర్.ఎస్. ఐ నరేంద్ర, పోలీస్ కానిస్టేబుల్ లు శివ, శ్రీరామ్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *