ఇంటర్నీస్ కు బి.ఎల్.ఎస్ శిక్షణ ముగింపు…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రతి వైద్య విద్యార్థికి బేసిక్ లైఫ్ సపోర్ట్ స్కిల్స్ పై శిక్షణ తప్పనిసరి అని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ అన్నారు. శుక్రవారం అనస్తీసియా విభాగంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆదేశాల మేరకు ఇంటర్నీస్ కు బేసిక్ లైఫ్ సపోర్ట్ స్కిల్స్ పై జరుగుతున్న శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా హాజరైన ఆమె మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో బి.ఎల్.ఎస్ స్కిల్స్ వినియోగించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చునని అన్నారు. ఈ శిక్షణ మొత్తం 265 మంది ఇంటర్నెట్ కు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనస్థీషియా ప్రొఫెసర్ అండ్ హెచ్ .వో .డి డాక్టర్ జి .విశాల, అసోసియేట్ ప్రొఫెసర్ డా. శ్రీలత,పీడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్. రవీంద్ర, కార్డియాలజీ అసిస్టెంట్ డా. ప్రశాంత్, డా. సునియా బేగం ఇంటర్నీస్ విద్యార్థిలు పాల్గొన్నారు.