ఉపాధ్యాయులకు నిర్బంధ రెసిడెన్షియల్ శిక్షణ తరగతులను రద్దు చేయాలి
1 min read: ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్
పల్లెవెలుగు వెబ్ అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా హీల్ స్కూల్లో జరుగుతున్న లీడర్షిప్ ట్రైనింగ్ లో , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హిందీ ప్రధానోపాధ్యాయులు తోట రత్నకుమార్ ఆకస్మిక మరణం చాలా బాధ కలిగించిందని వారి కుటుంబానికి ఏపీ ప్రైమరీ టీచర్ అసోసియేషన్ తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నామని ఆఫ్టా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ప్రకాష్ రావు పత్రికలకు తెలియజేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసి పేరుతో నిర్బంధ రెసిడెన్షియల్ శిక్షణా తరగతులను నిర్వహిస్తుందని ఈ శిక్షణా కేంద్రాలు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి వసతులు లేని చోట నిర్వహిస్తుండటం వలన ఈ దుష్పరిణామం జరిగిందని వారు ఆవేదన చెందారు. అక్టోబర్ 11వ తేదీన ఈ లీడర్షిప్ ట్రైనింగ్ కార్యక్రమాలను జిల్లా కేంద్రాలు డివిజనల్ కేంద్రాల్లో నిర్వహించాలని రెసిడెన్షియల్ మోడ్ కాకుండా నిర్వహించాలని , 55 సంవత్సరాలు నిండిన ఉపాధ్యాయ ఉపాధ్యాయినిలకు ఈ శిక్షణ నుండి మినహాయింపు ఇవ్వాలని ఎస్ పి డి కి విన్నవించుకున్నామని వారు తెలియజేశారు , పాఠశాల సంచాలకులతో కూడా ఈ ట్రైనింగ్ జిల్లా కేంద్రాలు మరియు డివిజనల్ కేంద్రాల్లో నిర్వహించాలని వారు కోరామని తెలియజేశారు అయినప్పటికీ ప్రభుత్వం ఈ ట్రైనింగ్ ప్రోగ్రాములు నిర్వహించటం వలన ఒక ఉపాధ్యాయుడు శిక్షణ కేంద్రాలకు దగ్గర్లో వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్ల మృతి చెందడం బాధాకరమని వారు వాపోయారు . ముఖ్యమంత్రి వెంటనే స్పందించి చనిపోయిన ఉపాధ్యాయుని కుటుంబానికి సానుభూతితో 50 లక్షలు పరిహారం అందించాలని వారు కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ శిక్షణా తరగతులను రద్దు చేయాలని వారు కోరారు.