చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ
1 min readచిన్నతనం నుంచే సత్ప్రవర్తన కలిగి ఉండి మీ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి….
జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా IPS
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS ఆదేశాలమేరకు నంద్యాల జిల్లాలోని వివిధ స్కూలు మరియు కళాశాలలో జిల్లా పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై అనగా చిన్న పిల్లలు మహిళలపై జరిగే నేరాల గురించి, ట్రాఫిక్ నియమాలు మరియు రోడ్డు భద్రత నిబంధనలు, హెల్మెట్ ప్రాముఖ్యత, బాల్య వివాహాలు, సైబర్ క్రైమ్,డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు,రాగింగ్ మొదలగు వాటి గురించి స్కూల్లో కాలేజీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం పిల్లలందరూ బాగా చదువుకోవాలని చిన్నతనం నుంచే సత్ప్రవర్తనతో మెలగాలని , మీరు మీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకుని వచ్చే వారిగా ఉండాలని, మీ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చి మీ యొక్క చదువులలో మరియు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నట్లు పోలీస్ అధికారులు పిల్లలకు తెలియజేశారు. ఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ఉన్నాయెడల 100,112 నంబర్లకు తెలియజేయాలని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడమైనది.