జిల్లాలో ఎస్పీ ఆదేశాలతో ” సివిల్ రైట్స్ డే ” నిర్వహణ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: చట్టాలు, పౌర హక్కుల గురించి మండల, గ్రామ స్థాయిలలో ప్రజల సమస్యలపై గ్రామీణుల్లో అవగాహన.ప్రతి నెలా 30 తేదిన సివిల్ రైట్స్ డే నిర్వహించాలని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్ ఐపియస్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్బంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా పోలీసులు, రెవిన్యూ అధికారులతో కలిసి ” సివిల్ రైట్స్ డే ” ( పౌర హక్కుల దినోత్సవం) కార్యక్రమం నిర్వహించారు .ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సంబంధిత డీఎస్పీలు, ఎమ్ పిడిఓలు , సిఐలు, ఎస్సైలు, రెవిన్యూ అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ మరియు గ్రామ సచివాలయ కార్యదర్శులు మండలాలు, గ్రామాలు, వార్డులను సందర్శించారు. రాజ్యాంగంలోని చట్టాలు, పౌర హక్కుల గురించి ప్రజలకు అవగాహన చేశారు.ముఖ్యంగా అంటరానితనం, కుల వివక్షత లను ఎవరైనా ప్రోత్సహిస్తే అటువంటి వారి పై కఠిన చర్యలుంటాయని తెలిపారు.షెడ్డ్యూల్ కులాలు , షెడ్డ్యూల్ తెగల వారికి వచ్చే పథకాలు, అభివృద్ది పనులు మొదలగు అన్ని విషయాలలోను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ చదువుకుంటే చట్టాల గురించి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండి, కులం, మతం విభేదాలు లేకుండా జీవించాలని తెలిపారు.