PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెలుగోడు  పోలీస్ స్టేషన్  వద్ద పీస్ కమిటీ మీటింగ్ నిర్వహణ

1 min read

సబ్ ఇన్స్పెక్టర్ భూపాలుడు

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:  బక్రీద్ పండుగ సందర్భంగానంద్యాల జిల్ల  ఎస్పీ  రఘువీర్ రెడ్డి ఆదేశాలమేరకు ఆత్మకూరు డి.ఎస్.పి ఏ. శ్రీనివాసరావు మరియు ఆత్మకూరు ఇన్స్పెక్టర్  సూచనాలమేరకువెలుకోడు ఎస్ఐ భూపాలుడు  వెలుగోడు మండలంలోని పీస్​ కమిటీ  సభ్యులతో మీటింగ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా వెలుగోడు మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని గోవధ చేయవద్దని ప్రభుత్వం గోవధను నిషేధించిందని, సోషల్ మీడియాలో మత ఘర్షణలను ప్రేరేపించే వార్త ఏమైనా వస్తే నమ్మొద్దని, మీటింగ్ నకు హాజరైన కమిటీ పెద్దలు మరియు సభ్యులకు సూచనలు ఇవ్వడమైనది. మీకు ఏదైనా సమస్య ఉంటే ముందుగానే పోలీసులను సంప్రదించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెలుగోడు ఎస్సై తో పాటు పీస్ కమిటీ పెద్దలు మరియు సభ్యులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author