ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో భద్రతా ఆడిట్ నిర్వహణ
1 min readమహిళా డాక్టర్లు ఆరోగ్య రక్షణ, సహాయకుల కార్మిక,
సహాయకుల రక్షణ పై పరిశీలన చేసిన కమిటీ సభ్యులు
ఆసుపత్రుల యాజమాన్యాలు డాక్టర్ లకు, కార్మికులు,సహాయాలకు భద్రతతో కూడిన తగిన రక్షణ కల్పించాలి
జిల్లా పోలీస్ ఎ.ఆర్ డిఎస్పి వి.జి శ్రీహరి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆసుపత్రులలో పనిచేసే మహిళా డాక్టర్లు, ఆరోగ్య సంరక్షణ సహాయకులు, కార్మికులకు సురక్షితమైన పని వాతావరణాన్ని, రక్షణను కల్పించాల్సిన బాధ్యతను సంబంధిత ఆసుపత్రి ఉన్నతాధికారులు తీసుకోవాలని, అందుకు తగిన విధంగా రక్షణ ఏర్పాట్లు చేయాలనీ జిల్లా పోలీసు ఏఆర్ డిఎస్పీ వి.జి. శ్రీహరి చెప్పారు. ఆసుపత్రులలో మహిళా డాక్టర్లు ఆరోగ్య సంరక్షణ, సహాయకుల కార్మికుల రక్షణ పరిశీలనకై నియమించిన కమిటీ సభ్యులు మంగళవారం స్థానిక జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో భద్రతా ఆడిట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీహరి మాట్లాడుతూ కోల్ కత్తా లో వైద్య విద్యార్థినిపై అత్యాచార, హత్య ఘటన అనంతరం అటువంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా 100 పడకల పైన గల ఆసుపత్రులలో మహిళా డాక్టర్లు, ఆరోగ్య సంరక్షణ సహాయకులు, కార్మికులకు ఏర్పాటుచేసిన రక్షణ చర్యలపై భద్రతా ఆడిట్ నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ వారు జిల్లా స్థాయి కమిటీ ని నియమించారని, ఈ కమిటీ సభ్యులు ఆసుపత్రులలో మహిళా డాక్టర్లు, ఆరోగ్య సంరక్షణ సహాయకులు, కార్మికులకు ఏర్పాటుచేసిన రక్షణ చర్యలపై భద్రతా ఆడిట్ ని నిర్వహించి నివేదిక సమర్పిస్తారన్నారు. సదరు నివేదికను అనుసరించి, ఆయా ఆసుపత్రులలో రక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నియమించిన ప్రైవేట్ రక్షణ సిబ్బందిని కలిసి వివరాలను, వారి సూచనలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలోనికి అనవసరంగా వచ్చే ఆకతాయిలను కనిపెట్టాలని, ముఖ్యంగా రాత్రి సమయాలలో ఆసుపత్రిలోని వచ్చే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఆసుపత్రిలోని ప్రవేశిస్తే వెంటనే ఆసుపత్రి ఉన్నతాధికారులకు లేదా 112 నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయలని సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిలో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించే రక్షణ, ఇతర సిబ్బంది నియామక సమయంలో వారి గత చరిత్రను పరిశీలించి, మంచి నడవడిక కలిగిన వారిని మాత్రమే విధులలోనికి తీసుకోవాలని ఆసుపత్రి ఇంచార్జి సూపరింటెండెంట్ కు సూచించారు. జిల్లా ఆసుపత్రి ఇంచార్జి సూపరింటెండెంట్ షియాజీ, కమిటీ సభ్యులు డివిజినల్ పౌర సంబంధాధికారి సిహెచ్. దుర్గాప్రసాద్,డా:పద్మజా రాణి, డా:వి శారద, డా:షేక్ హఫీజా, కలెక్టరేట్ సూపరింటెండెంట్ విజయకుమార్ రాజు, రాధాకృష్ణ, శేషుకుమార్, జిల్లా ఫైర్ ఆఫీసర్ రాధాకృష్ణ, పోలీసు సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.అనంతరం డిఎస్పీ శ్రీహరి కమిటీ సభ్యులతో కలిసి ఏలూరులోని ఆంధ్రా ఆసుపత్రిని సందర్శించి, ఆసుపత్రిలో మహిళా వైద్య సిబ్బంది రక్షణకు తీసుకుంటున్న చర్యలు, సిసి కెమెరాలు పనితీరు, మహిళా వైద్య సిబ్బంది విశ్రాంతి ప్రదేశాలు, తదితరాలు పరిశీలించి, మహిళా వైద్య సిబ్బందికి తీసుకోవలసిన రక్షణ చర్యలపై ఆసుపత్రి సిబ్బందికి సూచనలు చేశారు.