23న ఆదోనిలో జరిగే సదస్సును జయప్రదం చేయండి AIAWU
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో చేయడానికి పనులు లేక కూలీలు వలసలు వెళ్తున్నారని, ప్రభుత్వం వలస నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ ఈనెల 23న ఆదోనిలోని భావసార కళ్యాణ మండపంలో జరుగు వ్యవసాయ కార్మిక సదస్సులు జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు దస్తగిరి, పెద్ద హల్తి సురేంద్ర, సిఐటియు జిల్లా నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పత్తికొండలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని దినాలు, కనీసం 400 రూపాయలు వేతనం ఇవ్వాలని, అందరికీ పనులు కల్పించాలని కోరుతూ,జనవరి 23వ తేదీన ఆదోని లోని భావసార కళ్యాణ మండపంలో సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి V.వెంకటేశ్వర్లు,ఉపాధి హామీ పీడీ హాజరవు తున్నారని తెలిపారు. కావున వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు దస్తగిరి పెద్దహుల్తీ సురేంద్ర సీఐటీయూ జిల్లా నాయకులు వెంకటేశ్వర రెడ్డి కోరారు.స్థానిక పత్తికొండ మండల పరిధి లోని హోసూరు గ్రామంలో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను సందర్భంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు గంగన్న, మధు, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.