PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజ్యసభ మాజీ సభ్యుడికి అభినందన

1 min read

కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ సభ్యులు

కర్నూలు, పల్లెవెలుగు:రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్​ ను శుక్రవారం కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.  అనంతరం శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హార్ట్​ ఫౌండేషన్​ ప్రధాన కార్యదర్శి డా. చంద్రశేఖర్​ మాట్లాడుతూ కర్నూలు జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసిన రాజ్య సభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్​ … ఆయన తనయుడు, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్​ విజయంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. జిల్లాలోని పేదలకు ఆర్థిక సాయం చేయడం…మినరల్​ వాటర్​ ప్లాంట్లు నిర్మించడం. కళ్యాణ మండపం, షాదీఖానా తదితరవి నిర్మించి ప్రజా నేతగా ఎదిగిన టీజీ వెంకటేష్​ మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ఎప్పుడూ ముందుంటారన్నారు. కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరించిన టీజీ వెంకటేష్​, మంత్రి టీజీ భరత్​ కు ఈ సందర్భంగా గౌరవాధ్యక్షుడు డా. భవాని ప్రసాద్​, ప్రధాన కార్యదర్శి డా. చంద్రశేఖర్​, కోశాధికారి డా. వసంత కుమార్​, సభ్యులు రాముడు తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author