జీవ వైవిధ్యాన్ని పరిరక్షించండి
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల: జిల్లాలో జీవ వైవిధ్య పరిరక్షణకు స్థానికంగా ఉన్న జీవ వనరులను గుర్తించి ప్రజలకు ప్రయోజనాలు అందించడమే అధర్ ఎఫెక్టివ్ ఏరియా బేస్డ్ కన్జర్వేషన్ మెజర్స్ ప్రధాన ఉద్దేశం అని యుఎన్డిపి ప్రతినిధి రుషి పంత్ వెల్లడించారు.సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో యూఎన్డిపి బృందం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, పరిశ్రమలు, డిఆర్డిఏ, ఇరిగేషన్ శాఖలతో శాఖ అధికారులతో ప్రిలిమినరీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా యుఎన్డిపి ప్రతినిధి రుషి పంత్ మాట్లాడుతూ జిల్లాలోని అటవీ ప్రాంతాలు, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు ఇతర ప్రభావంతమైన ప్రాంత జీవ వైవిధ్య పరిరక్షణకు స్థానికంగా ఉన్న జీవ వనరులను గుర్తించాలని సంబంధిత అధికారులను సూచించారు. సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల ప్రభావిత ప్రాంతాలలో స్థానికంగా ఉన్న వనరులను గుర్తించి ప్రజలకు స్థిరమైన అభివృద్ధి ప్రయోజనాలను అందించడమే OECMs ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమన్నారు. ఇందుకోసం సంబంధిత అధికారులు, జిల్లా యంత్రాంగం సహకారం అందించాలని కోరారు.జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ యుఎన్డిపి బృంద సభ్యులకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. జిల్లాలో ప్రముఖ దేవాలయాలు, సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, పరిశ్రమలు, నల్లమల అటవీ ప్రాంతాల్లో ప్రభావవంత వెలుపల పరిధిలో ఉన్న జీవ వనరులను గుర్తించి ప్రజలకు ఏ విధంగా ప్రయోజనాలు చేకూర్చగలమో అన్వేషించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.