PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుట్రపూరితంగా ఏలూరు టౌన్ ఆటో మొబైల్ కమిటీపై తప్పుడు ప్రచారం

1 min read

సమావేశంలో ఆటోనగర్ అధ్యక్షులు అరుణతార నాగేశ్వరరావు వెల్లడి

పాల్గొన్న సంఘ సభ్యులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు మీడియా సమావేశం ఆటోనగర్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు అరుణ తార నాగేశ్వరరావు మాట్లాడుతూ కొంతమంది కుట్రపూరితంగా,దురుద్దేశంగా అసోసియేషన్ పై తప్పుడు ప్రచారం ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తీవ్రంగా ఖండిస్తూ నిజాలను సభ్యులకు,ప్రజలకు తెలియజేసేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఆటోనగర్లో గత కొంతకాలంగా దొంగతనాలు జరుగుతున్నాయని ఒక దొంగతనంలో మరకాల దినేష్ అనే వ్యక్తి దొంగిలించిన వస్తువులతో పట్టుబడగా, అతని తండ్రి మరకాల మురళి అసోసియేషన్ ను  ఆశ్రయించి తన కొడుకు తాగిన మైకంలో తప్పు చేశాడని తనని క్షమించి వదిలి వేయమని,అతనిని పోలీసులకు అప్పగిస్తే తన పరువు, తన కుటుంబం పరువు పోతుందని, దొంగిలించిన వస్తువుల సొమ్ము తాను చెల్లిస్తామని ప్రాధేయపడడంతో,వస్తువులు యజమానులతో మాట్లాడి వారిని ఒప్పించి దినేష్ పై పోలీసు కేసు లేకుండా మరకాల మురళికి సహాయం చేశామని గుర్తు చేశారు. తర్వాత కాలంలో చిన్న,చిన్న దొంగతనాలు జరుగుతున్నాయి, వాటిని ఎవరు అమ్మారని యజమానులు మా దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు. దానిపై మేము దృష్టి సారించగా ఆటోనగర్ నుండి ఇద్దరు పెయింటర్లు టాటా ఇండిగో సిల్వర్ కలర్ కారులో తీసుకువచ్చి తనకు అమ్మారని చెప్పడంతో, వారు ఆటోనగర్ లో విచారించగా మరకాల మురళి రెండవ కుమారుడు,గతంలో దొంగతనాలు చేసిన మరకాల దినేష్ ఈ దొంగతనం చేసినట్లుగా అతని వద్ద వస్తువులు కొన్న వలి గుర్తించాడు.ఆటోనగర్ లో తల ఎత్తుకొనివ్వకుండా చేస్తున్నాడని కోపంతో మేమే కొట్టామండీ అని చెప్పారు. ఇది జరిగిన మరుసటి రోజు 22వ తేదీ ఆటోనగర్ లో గతంలో పదవులు కోల్పోయి, తిరిగి ఎలా అయినా అధికారం కావాలని తాపత్రయపడే కొంతమంది వ్యక్తుల ప్రోత్సాహంతో,ప్రోద్బలంతో మరకాల మురళి అతని కుమారుడితో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్సీ,ఎస్టీ కేసును నాపైన మరో కొంతమంది పైన పెట్టించారు. జరిగిన విషయాలకు సంబంధించి దినేష్  మీద దాడి చేయడానికి గాని,నిన్న వాళ్లు ప్రెస్ మీట్ లో చెప్పినట్లుగా వారి దగ్గర నుండి  పది లక్షలు అడిగినట్లుగా గాని చెబుతున్న విషయాలు పూర్తిగా అవాస్తవాలు, పోలీసు దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, ఆ తరువాత మరకాల మురళి అతని వెనుకాల ఉన్న వ్యక్తులు చెప్పే అబద్ధాలు అన్నీ బట్టబయలు అవుతాయని ఆటోనగర్ లో ఇటువంటి కుట్రలు గతంలో ఎన్నడూ జరగలేదని విచారం వ్యక్తం చేశారు. ఈసమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి అడపా సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కర్రి ఈశ్వరరావు, కమిటీ సభ్యులు సయ్యద్ చోటే, గుమ్మళ్ళ వెంకట సూర్యనారా యణ,సభ్యులు ఉప్పులూరి హేమ శంకర్, మాజీ ఉపాధ్యక్షులు పల్లా అప్పారావు, మాజీ కమిటీ సభ్యులు లావేటి రామాంజనేయులు తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *