రాజ్యాంగ పరమైన పరిపాలన కొనసాగించాలి:యాట
1 min readపౌరునికి స్వేచ్ఛ సమానత్వ హక్కులు కల్పించిన అంబేద్కర్..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం రాష్ట్రాన్ని రాజ్యాంగ పరమైన విధంగా పరిపాలించాలని మాల యువ మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యాట ఓబులేష్ అన్నారు.కర్నూలు పట్టణంలోని మాధవి నగర్ మాలమహానాడు కార్యాలయంలో మంగళవారం డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం దినోత్సవ సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్ కు పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా యాట ఓబులేష్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి స్వేచ్ఛ సమానత్వ హక్కులు కల్పించే విధంగా భారత రాజ్యాంగ పిటికను రచన,నిర్మాణ కర్త,గొప్ప మహనీయుడు అంబేద్కర్ నేడు భారతదేశంలో అందరికీ సమానమైన ఓటు హక్కు రాజ్యాంగం ద్వారా కల్పించారని పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక హక్కులను నిరుద్యోగులకు, కార్మికులకు,మహిళలకు, ఉద్యోగులకు,రాజ్యాంగ పరమైన హక్కులు కల్పించిన దినోత్సవమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎన్.నవీన్,మాల మహానాడు యువ నాయకులు ఎన్.శ్యామ్ ప్రసాద్,అనిల్,సంధిఫ్,సూర్య, రాజు,దాదా బాష,చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.