సిసి రోడ్లు నిర్మాణం… కాలనీలకు కొత్త శోభ..
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : మండల కేంద్రంలోని స్థానిక ఈ బీసీ కాలనీలో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టడం వల్ల కాలనీలకు కొత్త శోభ నెలకొన్నదని వార్డు సభ్యులుసుభాన్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఈ బీసీ కాలనీలోని స్థానిక సిద్దేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న వీధుల నుండి అడ్డు రహదారులకు సిసి రోడ్లను పూర్తిగా నిర్మించి ఆ కాలనీకు నూతన శోభతో పాటు కాలనీవాసులు సైతం తమ కాలనీలలో సిసి రోడ్లు నిర్మాణం కావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని అన్నారు. అలాగే సిసి రోడ్డు నిర్మాణ సమయంలో పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ గౌడ్, వెల్ఫేర్ అసిస్టెంట్ దుర్గాభవాని, ఎంపీపీ తనయుడు ఈసా, వార్డు సభ్యులు హమీద్, అబ్దుల్ రెహమాన్, ఎస్ డి పి ఐ నాయకులు కే ,సలాం, సైఫుల్ల, ఫాజిల్, వరాల వీరేష్, తదితరులు పనుల నాణ్యతను పరిశీలించారు. అనంతరం కాలనీ వాసులు మంగయ్య, పట్న శెట్టి రాజా, బసవ, ఆర్ఎంపీ డాక్టర్ సంజీవ్, విశ్రాంత ఉద్యోగి ఆంజనేయులు, ఈరమ్మ, ల్యాబ్ గిరి, రాజన్న, కే సురేష్, తదితరులు వార్డు సభ్యులు సుభాన్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.