PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు నగరంలో కార్పొరేట్ హాస్పిటల్స్ నిర్మించడం అభినందనీయం

1 min read

అశ్విని హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో మాజీ రాజ్యసభ సభ్యులు బిజెపి వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  హైదరాబాద్, బెంగళూరు నగరాల తరహాలో కర్నూల్ నగరంలో కార్పొరేట్ హాస్పిటల్స్ నిర్మించడం అభినందనీయమని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. సీనియర్ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన అశ్విని హాస్పిటల్స్ ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గతంలో మెరుగైన వైద్య సేవల కోసం కోసం ఇతర మెట్రో నగరాలకి వెళ్లాల్సిన అవసరం వచ్చేదని, ఆ అవసరం లేకుండా ఇక్కడే ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ రావడంతో, అన్ని రకాల వైద్య సేవలు కర్నూలుకు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. సీనియర్ వైద్యులు శ్రీనివాస్ రెడ్డి మొదటినుంచి కూడా సేవా భావం కలిగిన వ్యక్తిని, అటువంటి వ్యక్తి ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునిక వసతులతో హాస్పిటల్ నిర్మించడం అభినందనీయమన్నారు. అలాగే ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా వివిధ విభాగాలలో నిష్ఠాత్తులైన డాక్టర్లు కనక 24 గంటలు ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నానని టీజీ వెంకటేష్ అన్నారు.  ఇటువంటి హాస్పిటల్స్ నిర్మాణం వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలతోపాటు, మరి ఎంతో మందికి వివిధ రకాలుగా ఉపాధి కూడా లభిస్తుందని అన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు ఎక్కువ రోజులు ఉండకుండా త్వరగా కోలుకొని వెళ్లాలని, ఆ విధంగా సేవలందించాలని ఆస్పత్రి వారిని టీజీ వెంకటేష్ కోరారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, టిడిపి నేత గౌరు వెంకట్ రెడ్డి,  పారిశ్రామిక వేక్త బీవీ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ నాయకులు నందిరెడ్డి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author