టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు..
1 min readవైసీపీకి షాక్ ల మీద షాకులు
ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో టిడిపిలోకి చేరిన పెద్దకటికే వ్యాపారస్తులు
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణానికి చెందిన పెద్దకటికే వ్యాపారస్తులు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నాయకులు బందే నావాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో పెద్దకటికే వ్యాపారస్తులు ఇబ్రహీం, బందే నావాజ్, రహంతుల్లా, ఇలియాస్, జాకీర్, సత్తార్ లతో పాటు వారి అనుచరులు దాదాపు 100 కుటుంబాలు టిడిపిలో చేరారు. పెద్ద కటిక వీధి నుంచి భారీ ర్యాలీగా వచ్చారు. ముందుగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారికి పెద్దకటికే వ్యాపారస్తులు భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ముందుగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. ఎవరు ఎలాంటి బెదిరింపులు ప్రలోభాలు పెట్టలేదని తాము స్వచ్ఛందంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు పెద్దకటికే వ్యాపారస్తులు తెలిపారు. పట్టణ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి తాము మద్దతుగా నిలిచేందుకు పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల ముందు ఉంటాయి ఇప్పుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎవరికి లేదన్నారు. పార్టీ బలోపేతానికి అభివృద్ధికి సహకరించినందుకు పెద్దకటికే వ్యాపారస్తులు పార్టీలోకి వస్తున్నారని, ఎవరిని బెదిరించి పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కొందరు వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. పెద్దకటికే వారికి స్లాట్ హౌస్ 2014లో మంజూరు చేయించడం జరిగిందని, దాన్ని వైసిపి పట్టించుకోకుండా గాలికి వదిలేసిందన్నారు. గతంలో మంజూరు చేసిన పనులు సక్రమంగా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఈరోజు అభివృద్ధికి సహకరించి పార్టీలో వస్తున్నారని ఇందుకు కొంతమంది అనవసర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి కి వీరికి అనుబంధం ఉందని కొత్త ఎవరు కాదన్నారు. పదవులకు ఆశించి ఎవరు పార్టీలోకి రావడంలేదని పార్టీ బలోపేతం కోసం ముందుకు వస్తున్నారు. అన్ని వర్గాలకు పట్టణంలోని ఉన్న ప్రతి వ్యాపారస్తులకు బీవీ కుటుంబం అండగా నిలుస్తుంది అన్నారు. ప్రతి వ్యాపారి బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకునే విధంగా చర్యలు చేపట్టామన్నారు. కటిక కులస్తులకు ఖురేషి భవన్ పెట్టాలని నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. ప్రతి కటికే వర్గానికి అండగా నిలుస్తామని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఎవరు చేయాల్సిన అవసరం లేదన్నారు. స్వేచ్ఛగా వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలని, చేపట్టబోయే శాశ్వత పనులు ద్వారా శాశ్వతంగా నిలుస్తాయన్నారు. పార్టీలో చేరిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.