ఉమ్మడి సర్వీసు రూల్స్ సాధనకు సహకరించండి..
1 min readబిజెపి అధ్యక్షులు పురందేశ్వరి మరియు రాష్ట్ర మంత్రి సత్య కుమార్ కు ఆపస్ వినతి
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్న విధంగా ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలకు సహకరించి కేంద్ర ప్రభుత్వం ద్వారా తగు ఉత్తర్వులు ఇప్పించిఉపాధ్యాయులకుఅన్నికేడర్లప్రమోషన్లను చేపట్టేందుకు సహకరించాలని విజయవాడ నందు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరి కి, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మాత్యులు శ్రీ వై సత్య కుమార్ యాదవ్ ని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ ,ప్రధాన కార్యదర్శి జీ వీ సత్యనారాయణ, రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓలేటి శాస్త్రి, హరిపూర్ణ ప్రసాద్ మహిళా కన్వీనర్ పి పద్మ, కాకినాడ జిల్లా అధ్యక్షులు చలపతి ,ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, బాపట్ల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ కుమార్ తదితరులు కలిసి వినతి పత్రాలు ఇచ్చి కోరడం జరిగింది.ఈ సందర్భంగా ఆపస్ బృందం కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ అమలు చేయాలని, 117 జీవో రద్దుచేసి 3,4,5 తరగతులను ప్రాథమిక పాఠశాలలో కొనసాగించాలని, తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాలను సమాంతరంగా కొనసాగించాలని, డిఈఓ పూల్ లో ఉన్న పండితులకు ప్రమోషన్లు ఇవ్వాలని, ఈ సంవత్సరం ఎస్ఎస్సి పరీక్షలను రెండు మీడియంలో నిర్వహించాలని, మెడికల్ రియంబర్స్మెంట్ మరియు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ సమస్యల పరిష్కారం కోసం ఈహెచ్ఎస్ స్టీరింగ్ కమిటీ మరియు మేనేజ్మెంట్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని, అవయవ దానం చేసిన ఉద్యోగులకు సాధారణ బదిలీలలో ప్రాధాన్యత ఇవ్వాలని, ఎంటిఎస్ 1998 ,2008 టీచర్లను రెగ్యులర్ చేసి పదవి విరమణ వయసు 62 సంవత్సరాలు పెంచాలని తదితర సమస్యలను వారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.వారిరువురు సానుకూలంగా స్పందించి ఉపాధ్యాయులకు అండగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎస్ బాలాజీరాష్ట్ర అధ్యక్షులుఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తెలిపారు.