PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సహాకారం అందించండి

1 min read

వైద్య ఆరోగ్య శాఖామంత్రిని కోరిన బిజెపి అసెంబ్లీ కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడు

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ను పత్తికొండ బిజెపి తాలూకా కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడు కోరారు. శుక్రవారం పాత్రికేయులకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్  ను ప్రత్యేకంగా కలిసి పత్తికొండ ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికీ పూర్తి సహాయ  సహకారాలు అందించి పత్తికొండ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటునందించాలనికోరానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గతకొన్నేళ్లుగా ఆసుపత్రి ఏ మంత్రం అభివృద్ధికి నోచుకోక పూర్తి వెనుకబడిపోయిందన్నారు. జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గాల్లో పడమటి ప్రాంతమైన పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని తెలిపామన్నారు. నిత్యం ఈ ప్రాంతంలో కరువు కాటకాలే ఉన్నాయని వివరించామన్నారు. గత కొన్నేళ్లుగా వైద్యశాల రూపురేఖల్లో మార్పులు చోటు చేసుకోలేదని వివరించామన్నారు. ఈ వైద్యశాల అభివృద్ధి మాత్రం ఎక్కడా వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో 80 శాతం పైగా నిరుపేద కుటుంబాలే, కూలీ పనులు చేసుకుంటే తప్ప పూట గడవని ప్రజానికమే ఇక్కడ ఉన్నట్టు మంత్రికి వివరించామన్నారు.  ఇక్కడి ప్రభుత్వ వైద్యశాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం  ఉందని అన్నారు. పత్తికొండ ప్రభుత్వాసుపత్రిలో అత్యవసర చికిత్సలకు ఏమాత్రం తావులేదు. కేవలం పత్తికొండ ప్రభుత్వ వైద్యశాల ప్రథమ చికిత్స కేంద్రంగా మాత్రమే ఉందన్నారు. అత్యవసర చికిత్సల కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కర్నూలు నగరానికి వెళ్లాల్సి వస్తుందన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *