వెనుకబడిన పత్తికొండ అభివృద్ధికి సహకరించండి..
1 min readమంత్రి నిమ్మలకు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ నివేదన.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పూర్తిగా వెనుకబాటుకు గురైన పత్తికొండ ప్రాంత సమగ్ర అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుుడుకు పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ నివేదించారు. సోమవారం కర్నూల్ లోని మౌర్య ఇన్ హోటల్లో జరిగిన ఎన్డీఏ కూటమి నేతల సమావేశంలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రిగా మొదటిసారి కర్నూలుకు విచ్చేసిన నిమ్మల రామానాయుడు గారికి కేఈ శ్యాం కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పత్తికొండ నియోజకవర్గ సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పత్తికొండ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతమని, ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించా లని మంత్రిని కోరారు. నియోజకవర్గంలోనీ హంద్రీనీవా నీటి ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని కోరారు. అలాగే పశ్చిమ ప్రాంతంలోని 106 చెరువులను హంద్రీనీవా ద్వారా నింపే పనులను పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించాలని కోరారు.