PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేవాలయాల భూములను ఆక్రమించి వక్ఫ్ బోర్డ్ భూములుగా మార్చారు..

1 min read

విశ్వ హిందూ పరిషత్,దక్షిణాంధ్ర, కర్నూలు. విలేఖరుల సమావేశం

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  విశ్వహిందూ పరిషత్, దక్షిణాంధ్ర, కర్నూలు ఆధ్వర్యంలో ఈరోజు 3/8/24 న ఉ: 11:00 గంటలకు శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వామి సమావేశ మందిరంలో జరిగిన పత్రికా విలేఖరులు మరియూ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమావేశంలో విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర రాష్ట్ర అధ్యక్షులు నంది రెడ్డి సాయి రెడ్డి , దక్షిణాంధ్ర రాష్ట్ర సహకార్యదర్శి, ప్రాణేష్, దక్షిణాంధ్ర విశేష సంపర్క కన్వీనర్ ప్రతాపరెడ్డి, దక్షిణాంధ్ర రాష్ట్ర కోశాధికారి సందడి మహేశ్వర్, విశ్వహిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు టిసి మద్దిలేటి గారెలు పాల్గొన్నారు, రాష్ట్ర అధ్యక్షులు నంది రెడ్డి సాయి రెడ్డి  మాట్లాడుతూ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్న వక్ఫ్ బోర్డ్ చట్టం అనేక లొసుగులతో కూడి ఉన్నదని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ బోర్డ్ కు పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగించి , ప్రభుత్వం యొక్క ఎటువంటి అజమాయిషీ సంబంధిత బోర్డ్ పై  లేకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా సదరు బోర్డు దేశంలో అనేక ఇతర మతస్థుల, దేవాలయాల భూములను ఆక్రమించి వక్ఫ్ బోర్డ్ భూములుగా మార్చివేశారు ఇలా సుమారు 2 లక్షల ఎకరాలు అంటే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వేశాఖ తరువాత అంతా పెద్ద మోత్తంలో భూములు కలిగిన ఒక మత సంస్థ గా ముస్లిం మైనారిటి వర్గాలకు చెందిన వక్ఫ్ బోర్డ్ అవతరించింది.ఇలాతాము కోరుకున్న,తమకు నచ్చిన భూములన్నీ సదరు బోర్డ్ లో కలిపేసుకున్నారు.ఈ రకంగా సన్న, చిన్న కారు రైతులు మోదలుకుని పెద్ద పెద్ద దేవాలయాల నిర్వహణ కోసం జమీందారులు రాజులు ఇచ్చిన భూములను కూడా వక్కు భూముల పేరిట మార్చేయడం జరిగింది. దీనిని ప్రశ్నించడం కోసం ట్రిబ్యునల్ కు వెళదామంటే అక్కడున్న వక్కో ట్రిప్నలో కూడా అందరూ ముస్లిం వర్గానికి చెందిన వారిని ఉంచడం జరిగింది. దీనివల్ల త్రిపురాలకు వెళ్లిన ఎవరికి కూడా న్యాయం జరిగే అవకాశాలు లేవు. కాబట్టి ఈ యొక్క వొక్కు బోల్డ్ చట్టాన్ని సవరించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్రప్రదేశ్ తమ సంతోషాన్ని తెలియజేస్తూ

సదరు చట్టంలోని మార్పులు చేయటానికి, చట్టాన్ని ఆమొదించడానికి ఇతర పార్టీల గౌ.యం.పీలు సహకరించనందున, ఈ వక్ఫ్ బోర్డు చట్టం సవరణలను గురించి చర్చించడానికి పార్లమెంటు (J.P.C) కి నివేదించబడినది. ఆ కమిటి “ప్రజాభిప్రాయ సేకరణ” చేయాలని నిర్ణయించినందున సదరు చట్ట సవరణ కోసం దేశంలోని హిందూ బంధువులు, కుల సంఘాల , ధార్మిక , సామాజిక సంస్థల ప్రతినిధులు, అందరూ కుటుంబంలోని ప్రతి ఒక్కరి పేరుతో సదరు విషయాన్ని జే.పి.సి.కి మెయిల్ ద్వారా, రిజిష్టర్ పోస్ట్ ద్వారా గానీ పంపాలని పిలుపునిచ్ఛారు.ఈ క్రింది తెలియజేసిన విధంగా  పంపాలని ఇలా చేయకపోతే భవిష్యత్తు తరాల్లో హిందువుల భూములు మిగలవని అన్నారు.

 చైర్ పర్సన్ 

 వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ 

 పార్లమెంట్ హౌస్ 

 న్యూఢిల్లీ, భారతదేశం

విషయం: రాజ్యాంగ విరుద్ధం కారణంగా వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని అభ్యర్థన

గౌరవనీయ పీఠాధిపతి,*

 నేను,_____ ____ కుమారుడు/కుమార్తె, ____ నివాసి, వయస్సు___, సంవత్సరాలు,

 భారతదేశానికి సంబంధించిన ఒక పౌరుడు, వక్ఫ్ చట్టానికి సంబంధించిన క్లిష్టమైన సమస్యను మీ గౌరవనీయ కమిటీ దృష్టికి తీసుకురావడానికి ఈరోజు మీకు వ్రాయండి.  ప్రస్తుత వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల, క్షుణ్ణంగా తిరిగి మూల్యాంకనం చేసి, తదనంతరం రద్దు చేయవలసి ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం.ఆర్టికల్ 14 ప్రకారం భారత రాజ్యాంగం చట్టం ముందు సమానత్వ సూత్రాన్ని ప్రతిపాదిస్తుంది మరియు మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది.  ఏది ఏమైనప్పటికీ, వక్ఫ్ చట్టం, దాని ప్రస్తుత రూపంలో, ఆస్తులు మరియు వ్యవహారాల నిర్వహణలో ఒక నిర్దిష్ట మత సమాజానికి ప్రాధాన్యతనిస్తుంది, ఇది మన దేశం యొక్క లౌకిక ఆకృతికి విరుద్ధమైనది మరియు దేశంలోని 85% ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుంది.  సమానత్వం మరియు న్యాయబద్ధత అనే రాజ్యాంగ ఆదేశాన్ని సవాలు చేసే అసమానతను సృష్టించడం, సారూప్య చట్టాల ప్రకారం ఇతర కమ్యూనిటీలకు మరియు అన్ని ఇతర మతాలకు చెందిన వ్యక్తులకు ఈ ప్రత్యేక చికిత్సను విస్తరించడం లేదు. ఇంకా, వక్ఫ్ చట్టం యొక్క నిబంధనలు తరచుగా ఆస్తి హక్కులు, పరిపాలనా అసమర్థత మరియు చట్టం యొక్క సంభావ్య దుర్వినియోగానికి సంబంధించిన సమస్యలకు దారితీస్తాయి.  ఆస్తి యజమానుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ, తగిన ప్రక్రియ లేదా తగిన పరిహారం లేకుండా ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించిన అనేక సందర్భాలు ఉన్నాయి.  ఇటువంటి చర్యలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A కింద ఊహించిన ఆస్తి హక్కుకు నేరుగా విరుద్ధంగా ఉంటాయి. వక్ఫ్ బోర్డులు అధికార దుర్వినియోగాన్ని నిరోధించడానికి వక్ఫ్ చట్టంలో తగిన తనిఖీలు మరియు బ్యాలెన్స్‌లు లేవు, ఫలితంగా అవినీతి, దుర్వినియోగం మరియు జవాబుదారీతనం లేకపోవడం వంటి ఆరోపణలు వస్తున్నాయి.  ఇది చట్టబద్ధమైన పాలనను బలహీనపరచడమే కాకుండా దేశ చట్టపరమైన మరియు పాలనా చట్రంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ప్రస్తుత వక్ఫ్ చట్టం చట్టవిరుద్ధం మరియు ముస్లిం మెజారిటీ దేశాలతో సహా ప్రపంచంలో ఎక్కడా అలాంటి చట్టం లేదు.  అలాగే, వక్ఫ్ చట్టం వక్ఫ్ బోర్డు మాఫియోసో వంటి బలవంతం, మోసం మరియు హింస ద్వారా భూమి & ఆస్తులను లాక్కోవడానికి అనుమతించింది. పైన పేర్కొన్న అంశాల నేపథ్యంలో, ఈ క్రింది సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలని నేను జాయింట్ పార్లమెంటరీ కమిటీని కోరుతున్నాను:వక్ఫ్ చట్టం రద్దు: రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా, చట్టం ముందు పౌరులందరినీ సమానంగా చూసేలా చట్టం రద్దు చేయాలి.వక్ఫ్ చట్టాన్ని 1923లో మొదటిసారిగా ముస్సల్మాన్ వక్ఫ్ చట్టంగా ప్రవేశపెట్టిన తేదీ నుండి తక్షణమే రద్దు చేయాలి మరియు 1954లో తిరిగి ప్రవేశపెట్టి 1995లో సవరణ చేయాలి.వక్ఫ్ కింద సేకరించబడిన ఏదైనా భూమి/ఆస్తి లేదా నిర్మాణం చట్టవిరుద్ధంగా పరిగణించబడాలి మరియు 1923కి ముందు లేదా తర్వాత సరైన హిందూ యజమానికి తిరిగి ఇవ్వాలి. ఒక వేళ, సరైన హిందూ యజమానిని కనుగొనలేకపోతే, ప్రస్తుత వక్ఫ్ బోర్డుల క్రింద ఉన్న భూమి, ఆస్తి మరియు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం: ఏదైనా కొత్త చట్టం దుర్వినియోగాన్ని నిరోధించడానికి మరియు ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను నిర్ధారించడానికి కఠినమైన మార్గదర్శకాలు మరియు జవాబుదారీ విధానాలను కలిగి ఉండాలి.

 శుభాకాంక్షలతో

 పేరు:

 చిరునామా:

  ఆధార్ నంబర్:

పై సమాచారాన్ని ఆంగ్లము(ఇంగ్లీష్)లో గానీ , హిందీ లో గానీ మెయిల్ చేయాలని….లేదా ప్రింట్ తీసి రిజిష్టర్ పోస్ట్ ద్వారా గానీ ఈ క్రింది తెలిపిన అడ్రసుకు  పంపాలని తెలియజేశారు.

మనం పంపవలసిన చిరునామా

ఇంగ్లీషులోనే_ పంపాలి.

తపాలా చిరునామా

Joint Secretary (JM)

Lok Sabha Secretariat

440, Parliament House

New Delhi 110001

Fax: 011 – 2301 7709

పోస్ట్ చేయలేని లేదా ఫ్యాక్స్ చేయలేని వారి కోసం, దయచేసి మీ వ్యాఖ్యలను [email protected] కి ఇమెయిల్ చేయండి .పోస్ట్ ద్వారా పంపే అభిప్రాయములకు అధిక ప్రాధాన్యత వుంటుంది.  కనీసం మెయిల్ ద్వారనైనా పంపండి.పోస్ట్ ద్వారా పంపించేటట్లైతే వెంటనే పంపగలరు.ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యాలయ సహప్రముఖ్ భూపాలాచారి, కర్నూలు జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్, సహకార్యదర్శి ఈ పూరి నాగరాజు,కోషాధికారి శ్రీనివాస రెడ్డి , బజరంగ్ దళ్ జిల్లా సురక్షా ప్రముఖ్ శివ సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు.

About Author