కరోన సెకెండ్ వేవ్.. భయంకరం
1 min readన్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తుండటంపై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పందించారు. సెకెండ్ వేవ్ ఈ నెలలో తారాస్థాయిలో ఉండొచ్చని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు మినీ లాక్‌డౌన్‌ల అవసరం ఉందని, వీలైనంత వరకూ ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. కరోనా కేసులు గత కొద్ది రోజులుగా కేసులు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశమని ఆయన ఒక సందేశంలో పేర్కొన్నారు. కోవిడ్-19 మేనేజిమెంట్ జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా కూడా గులేరియా ఉన్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు మాస్క్‌లు ధరించడం లేదని, సామాజిక దూరం పాటించడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.