దోపిడీకి తెర లేపిన కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
1 min readప్రవేశ పరీక్ష పెట్టడం చట్టరీత్యా నేరం
అడ్మిషన్ ఫీజు పేరుతో అక్రమ డొనేషన్లు వసూలు
విద్యార్థి సంఘాల ఆవేదన
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో నే స్థానిక ఎంపీడీవో సమావేశ భవనంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాల సమావేశం స్థానిక ఎంఈఓ 1 ఎంఈఓ 2 ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశాన్ని విద్యార్థి సంఘాలు అడ్డుకొని ఎంఈఓ ఆంజనేయులు మరియు మధుసూదనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు నరసన్న ఖాజా కృష్ణ సురేంద్ర రఘు విజయ్ మాట్లాడుతూ కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యాసంస్థల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ ఫీజు పేరుతో అక్రమ డొనేషన్లు వసూలు చేస్తూ అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రవేశం పొందాలంటే ఎంట్రెన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలని నిబంధన పెట్టడం అన్యాయమని అలాగే స్కూల్లోనే బుక్స్ బ్యాగ్స్ షూస్ బట్టల సైతం అమ్మతో విద్యాసంస్థలను వ్యాపార కేంద్రాలుగా మార్చాలని అదేవిధంగా విద్యాపు చట్టం ప్రకారం 25% ఉచిత సీట్లు పొందిన విద్యార్థులు సైతం ఫీజు కట్టాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు ఇకనైనా అధికారులు స్పందించి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు కళ్లెం వెయ్యకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.