నాడు నిజమైన కేజీబీవి ప్రిన్సిపాల్ అవినీతి నేడు అబద్దమా…
1 min readఅధికారులే విచారణ లో తేల్చిన కేజీబీవీ ప్రిన్సిపల్ కవిత అవినీతి చిట్టా ఏమైంది….
జిల్లా విద్యాశాఖ అధికారుల తీరుకు నిరసనగా కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన చేసిన ఎమ్మిగనూరు ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు.
పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు: కేజీబీవీ ప్రిన్సిపాల్ చేసిన అవినీతి నాటి అధికారులు చేసిన విచారణలో అవినీతి నిజమని తేల్చారు, మరి నేడు ఆ అవినీతి అంతా కూడా నిజాయితీ అయిపోయింద అని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మహేంద్ర బాబు, శేఖర్,వీరేష్ యాదవ్, సురేంద్ర బాబు, సోమశేఖర్,ఖాజా, ఆఫ్రిద్, వెంకటేష్, నాగరాజు లు జిల్లా ఉన్నతాధికారులను ప్రశ్నించారు.శనివారం స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలో సోమప్ప సర్కిల్ నందు ఐక్య విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో కళ్ళకు నల్లా బ్యాడ్జిలతో నిరసన ధర్నా చేయడం జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల కడుపులు మాడ్చి, అక్రమంగా విద్యార్థుల సొమ్మును కాజేసిందని ప్రత్యేక కమిటీ ద్వారా విచారణ జరిపి,ఆమెను విధుల నుండి పూర్తిగా తొలగించారని మరి ప్రస్తుతం ఆ అవినీతి నిజాయితీగా కనిపించిందా అని ప్రశ్నించారు.విద్యార్థుల కడుపులు నింపాల్సిన ఒక ప్రిన్సిపాల్ వారి కడుపులు కాల్చి అక్రమ సంపాదన చేసిన ఆమెకు అధికారులు కొమ్ము కాయడం వెనుక మరో కుట్ర దాగి వుందని, దీనికి జిల్లా విద్యా శాఖ అధికారులు వత్తాసు పలుకుతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుందని ఆరోపించారు.కావున తక్షణమే అవినీతి ప్రిన్సిపాల్ ను తొలగించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు చెపడాతమని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో విద్యార్ధి సంఘాల నాయకులు కృష్ణ,అలెగ్జాండర్,తిమ్మప్ప, ఈరన్న, చరణ్,హరికృష్ణ,నవీన్,బాషా తదితరులు పాల్గొన్నారు.